Prakasam: ఒంగోలు భూ కబ్జాల కేసులో 38 మందిని అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా కొనసాగుతున్న భూ కబ్జాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. వీలైనంత తొందరలో విచారణ దర్యాప్తు పూర్తి చేస్తాని తెలిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన భూకబ్జాలపై ఎస్పీ మలికా గార్గ్‌తో కలిసి చర్చించారు. భూకబ్జాలపై ఫిర్యాదులు వచ్చాయని, ఈ మేరకు లాయర్‌పేటలోని ఓ ఇంట్లో తనిఖీలు చేయగా.. పూర్ణచంద్రరావు అనే వ్యక్తి కొన్ని పత్రాలు సృష్టిస్తున్నట్లు పోలీసులు గుర్తించారని కలెక్టర్ చెప్పుకొచ్చారు.
Read Also: Health Tips : రాత్రి పడుకొనే ముందు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
Also Read
- KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
అన్ని పత్రాలకు నకిలీ స్టాంపులు సృష్టించి ఫోర్జరీ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. 572 ఫేక్ డాక్యుమెంట్స్, 60 స్టాంప్స్, 1200 జ్యుడిషియల్, నాన్ జ్యుడిషియల్ పత్రాలను పోలీసులు సీజ్ చేశారు.. నకిలీ డాక్యుమెంట్స్ కేసులో 38 మందిని అరెస్టు చేశారు.. కనిగిరి, మార్కాపురంలో కూడా భూకబ్జాలపై సిట్ దర్యాప్తు జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. గత 10-12 సంవత్సరాల నుంచి భూకబ్జాలు జరుగుతున్నట్టు విచారణలో తేలింది.. ఖాళీ భూములు గుర్తించి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేస్తున్నారు అని కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు.
Read Also: Janareddy: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా ఉంది కాబట్టి ఐటీ దాడులు
బాధితులు ఎవరైనా ఉంటే సిట్ అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. అయితే, భూములకు నకిలీ జీపీఏ, వీలునామాలు తయారు చేసి కబ్జా చేశారని ఆయన చెప్పారు. ఇలాంటి ఆస్తుల్ని ఒంగోలులో 52 గుర్తించాము.. భూకబ్జాల కేసులో ఒక ప్రభుత్వ ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అరెస్టైన వారిలో 2 ప్రధాన పార్టీలకు చెందిన వారు ఉన్నారని ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!