వరంగల్ లోని ఈద్గాలో రాష్ట్ర దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ డా.కడియం కావ్య హన్మకొండ బొక్కల గడ్డలోని ఈద్గాలో అలాగే ఖిలా వరంగల్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
నల్గొండ ఈద్గాలో బక్రీద్ పండుగ ప్రత్యేక ప్రార్థనల్లో రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మల్కాజ్గిరి అసెంబ్లీ పరిధిలోని సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పని తీరు ఉండాలి తప్ప స్టాటిక్ గా ఉండకూడదు అని తెలిపారు.
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
Rythu Runa Mafi: ఆగస్టు 15వ తేదీలోపు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలుకు రేవంత్ సర్కార్ విధివిధానాలపై కసరత్తు కొనసాగిస్తుంది. అర్హులైన వారికే రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలను అందిస్తున్నారు.
West Bengal: పశ్చిమ బెంగాల్ గవర్నర్‌పై డ్యాన్సర్ లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376, 120బి కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.
Bandh Continue In Medak: మెదక్ జిల్లాలో ఇవాళ (సోమవారం) బంద్‌కు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. గోవుల రక్షణకు చేసిన ప్రయత్నంలో హిందువులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించారని పేర్కొన్నారు.