టీ20 వరల్డ్‌కప్ 2024లో శ్రీలంక భారీ విజయాన్ని నమోదు చేసింది. 83 పరుగుల తేడాతో ఆ జట్టు నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. గ్రూప్- డీలో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో.. శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 201 పరుగులు కొట్టింది. లంక ఇన్నింగ్స్‌లో మాథ్యూస్ 15 బంతుల్లో 30, హసరంగ 10 బంతుల్లో 20 రన్స్ చేయగా.. చరిత్ అసలంక శరవేగంగా 21 బంతుల్లో 46 పరుగులు చేసి శ్రీలంకకు భారీ స్కోర్‌ను అందించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అసలంక ఎంపికయ్యాడు. తన ఇన్నింగ్స్‌లో ఐదు సిక్సర్లు కొట్టాడు.
Read Also: Gudivada Amarnath: ఋషికొండ కట్టడాలపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి
ఇక, ఓపెనర్ మెండిస్ కూడా 46 పరుగులు చేశాడు. ఇక, 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ టీమ్ కేవలం 118 పరుగులకు కుప్పకూలిపోయింది. నిజానికి ఓపెనర్లు మైఖేల్ లివిట్, మ్యాక్స్ ఓదౌడ్‌లు 4.2 ఓవర్లలో 45 పరుగులు చేశారు. కానీ, ఓదౌడ్ అవుట్ అయ్యాక.. నెదర్లాండ్స్ టీమ్ బ్యాటర్లు క్రీజ్‌లో ఎక్కువ సేపు ఉండలేక పోయారు. వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. నువాన్ తుషారా మూడు, పతిరన రెండేసి వికెట్లు పడగొట్టారు.