East Godavari Floods: తూర్పు గోదావరి జిల్లాలోని గోకవరం మండలంలో పెద్ద కాలువకు ఆకస్మిక వరద వచ్చింది. దీంతో గోకవరంలోని సాయి ప్రియాంక కాలనీ, పోలవరం నిర్వాసితుల కాలనీ తదితర ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. ఇళ్ల చుట్టూ నీళ్లు చేరడంతో గోకవరం కాలనీల్లో ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బురద కాలువ పొంగి పోర్లడంతో కోరుకొండ మండలంలోని శ్రీరంగపట్నం గ్రామం కూడా ముంపులో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో గోకవరంలోని ముంపు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్వయంగా పరిశీలించారు.
Read Also: Dhar: మధ్యప్రదేశ్ రైల్వే పనుల్లో విషాదం.. భారీ క్రేన్ కూలి ఇద్దరు మృతి
ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ.. వరద నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అవసరమైతే అక్కడ రియల్ ఎస్టేట్ లేఔట్లను తొలగిస్తామని తెలిపారు. మొంథా తుఫాన్ తర్వాత వ్యాధులు ప్రభలే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాలో 10 వేల హెక్టార్లలో వరి పంట నేలకు ఒరిగింది, మరో 2 వేల హెక్టార్లలో పంట నీటి ముంపునకు గురైందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి వెల్లడించింది.