PM Modi: దశాబ్దం తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఈరోజు (శనివారం) దోడా జిల్లాకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కుటుంబం అనే మూడు కుటుంబాలు దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని దోచుకున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Kolkata: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం, హత్య జరిగిన తర్వాత జూనియర్ డాక్టర్లు నిరసన చేస్తున్నారు. సాల్ట్ లేక్‌లోని స్వాస్త్య భవన్ వెలుపల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు (శనివారం) ఆకస్మికంగా సందర్శించారు.
Kejriwal: తీహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఇవాళ ( శనివారం ) భార్య సునీతా కేజ్రీవాల్, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లతో కలిసి న్యూఢిల్లీలోని హనుమాన్ ఆలయాన్ని కేజ్రీవాల్ సందర్శించారు.
Water Leakage At Taj Mahal: దేశ రాజధాని ఢిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా తాజ్ మహల్ వద్ద నీరు లీకేజీ అయింది.
Karnataka BJP: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Tamil Nadu CM: కేంద్ర ఆర్థిక మంత్రికి క్షమాపణలు చెప్పిన జీఎస్టీ గురించి ప్రశ్రలు అడిగిన రెస్టారెంట్ యజమాని చెప్పిన వీడియో వైరల్ కావడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Cooking Oil: మధ్య తరగతి ప్రజలపై మరో పిడుగు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అయింది. వంటింటి ఖర్చు ఇకపై మరింతగా పెరగబోతుంది. ముడి, రిఫైన్డ్ వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర సర్కార్ ఒకేసారి 20 శాతం వరకు పెంచడంతో ఆ మేరకు వంటనూనెల రేట్లు పెరగనున్నాయి.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి పట్టణంలో ఆక్రమిత స్థలంలో నిర్మించిన సంజౌలీ మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై పోలీసులు నిన్న (శుక్రవారం) నీటి ఫిరంగులతో పాటు లాఠీచార్జీ చేశారు. దీనికి నిరసనగా నేడు (శనివారం) రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి.