Prakasam Barrage: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ ఆరవ రోజు కొనసాగుతుంది. డబుల్ ఐరన్ రోప్ పను డోజర్ కు కనెక్ట్ చేసి బోట్లను లాగే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న లోడ్ హెవీ కావడంతో లోడ్ యాక్సిల్ విరిగిపోయింది. ఇవాళ సరాసరి భూమిలోకి వేసిన స్తంభానికి కనెక్ట్ చేసి డోజర్ తో లాగే ప్రయత్నం చేస్తున్నారు.
Bhupathiraju Srinivasa Varma: తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు బొగ్గు కొరత కొత్తగా వచ్చిన సమస్య కాదని వ్యాఖ్యానించారు.
Ganesh Immersion: అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పోకనాటి వీధి వినాయకుడి ఊరేగింపు ప్రారంభమైన కాసేపటికే డీజే సౌండ్ బాక్సుల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీకి చెందిన పాటలు వేయడంపై బి. కొత్తకోటలో పోలీసులు కేసు నమోదు చేశారు.
Sub-Registrar Office: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పొకడలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్తి పలికింది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి రిజిస్ట్రేషన్ ల శాఖ చెల్లు చీటి పలికింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపురేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా, మంత్రి అనగని సత్య ప్రసాద్ ప్రతిపాదనలు పంపారు.
East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజానగరం మండలంలోని పల్ల కడియం గ్రామంలో వృద్ధ దంపతులు ప్రాణాలను కోతి తీసింది. ఫురుగు మందుల ప్యాకెట్ తీసుకుని వచ్చి వృద్ధ దంపతులు పేరట్లో పారేసిన కోతి.. అయితే, టీ పొడి అనుకుని పొరపాటున పురుగుల మందు వేసుకొని టీ తాగిన వెలుచూరి గోవింద్ (75), అప్పాయమ్మ (70) వృద్ధ దంపతులు మృతి చెందారు.
PHC Doctors: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం కుదించిన దానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) డాక్టర్లు వైద్య సేవలను ఆపేశారు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Nandigam Suresh: గుంటూరు జిల్లా మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఈరోజు మంగళగిరి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది కోర్టు.
Flood Flow Reduced: గోదావరి నది ప్రవాహం ఈరోజు (ఆదివారం) నిలకడగా కొనసాగుతుంది. గంట గంటకు క్రమేపీ గోదావరి వరద ప్రవాహం తగ్గుతుంది. ఇక, ధవళేశ్వరం, పోలవరం ప్రాజెక్టులకు భారీగా తగ్గిపోయిన వరద నీరు. ఇక, పోలవరం స్పిల్వే వద్ద నీటిమట్టం 31.655మీటర్లకు చేరింది.