Child Pornography Case: ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఈరోజు (సోమవారం) సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.
J&K Assembly Elections: లోక్సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ రోజు (సోమవారం) జమ్మూ అండ్ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటారు.
Sri Lanka President: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్టు( లెఫ్ట్ పార్టీ) నేత అనూర కుమార దిసానాయకే ఈరోజు (సోమవారం) శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
Delhi CM Atishi: ఈ నెల 21వ తేదీన (శనివారం) ఢిల్లీ రాష్ట్ర ఎనిమిదో ముఖ్యమంత్రిగా అతిషి మర్లెనా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఈరోజు (సోమవారం) ఆమె సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Anil Kumar Yadav: నెల్లూరు సిటీ నియోజకవర్గ కార్యకర్తలతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా కార్యకర్తల జోలికొస్తే మూడింతలుగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని వార్నింగ్ ఇచ్చారు.
అత్యంత పెద్దదైన భారతదేశానికి ఒకేసారి ఎన్నిక ఎలా కుదురుతుందా అని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. ప్రజాస్వామ్యం ఉండకూడదని.. అధ్యక్ష తరహా పాలన కోసమే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక.. దేశం ఐక్యంగా ఉండదు.. ఒకే దేశం ఒకే ఎన్నిక వాదన.. సీతారాం ఏచూరి మార్క్సిస్ట్ పార్టీని దేశంలో అభివృద్ధి చేసారు..
Chelluboina Venugopal: వంద రోజులు కూటమి పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టింది అని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మంచి ప్రభుత్వం కాదు ముంచిన ప్రభుత్వం.. చంద్రబాబు రోజుకోక డైవర్షన్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు.
Pawan Kalyan: ఇవాళ్టి నుంచి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదలు పెట్టారు. తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రం కావడంతో దీక్ష చేపట్టినట్లు తెలిపారు. దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేపట్టి దీక్షను డిప్యూటీ సీఎం ప్రారంభించారు.
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 25 కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం కోసం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనానికి కేవలం 8 గంటల సమయం మాత్రమే పడుతుంది.