Rajnath Singh: దేశ సరిహద్దులో భారత సైన్యం అలర్ట్ గా ఉందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అందువల్లే సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్తతలు జరగడం లేదన్నారు. కానీ, ఈ విషయంలో అజాగ్రత్త పనికి రాదు.. పొరుగు దేశాల నుంచి కవ్వింపు చర్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేశారు.
స్టైలిష్ లుక్‌తో మహేంద్ర సింగ్ ధోని అట్రాక్ట్ చేస్తున్నాడు. అచ్చం హాలీవుడ్ యాక్టర్లా కనబడుతున్నారు. ధోనీ కొత్త లుక్కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ గా మారిపోయాయి.
Cyber Attack In Iran: పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణంతో ప్రపంచమంతా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఈ సమయంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్లో ఈరోజు (శనివారం) భారీ స్థాయిలో సైబర్ దాడులు జరిగినట్లు తేలింది. దాంతో సర్కార్ లోని మూడు బ్రాంచ్‌ల (న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖలు) సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది.
Canada–India Row: లావోస్‌లో నిర్వహించిన భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చలు జరిపినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. దీనిపై భారత్ రియాక్ట్ అయింది. ఇరువురి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసింది.
Rahul Gandhi: తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు సమీపంలో భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
AR Rahman- Kamala Harris: నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు సపోర్టుగా ‘ద ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐ లాండర్స్ (ఏఏపీఐ)’ నిధుల సేకరణ టీమ్ ఓ సభను ఏర్పాటు చేయబోతుంది. ఆ సభలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు.
మోహన్ భగవత్ మాట్లాడుతూ.. భారత్‌లో మాట్లాడే ప్రతి భాషా జాతీయ భాషే అని పేర్కొన్నారు. అలాగే, సామాజిక ఐక్యత, సామరస్యం కోసం కులమతాలకు అతీతంగా వ్యక్తుల మధ్య స్నేహం ఉండాలన్నారు.
Hurricane Milton: మిల్టన్ తుపాను ఉద్ధృతికి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం పూర్తిగా అతలాకుతలమైంది. గురువారం సంభవించిన బలమైన సుడిగాలుల ధాటికి అక్కడి తీర ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగింది.
America vs Iran: ఇరాన్- ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో యూఎస్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌కు చెందిన పెట్రోలియం, పెట్రో కెమికల్ రంగాలపై తన ఆంక్షలను విస్తరించింది అమెరికా.