HYD Police: అఫ్జల్‌గంజ్ కాల్పులు జరిపిన దుండగులు హైదరాబాద్‌లోనే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆ ముఠా ఇంకా రాష్ట్రం దాటలేదన్నారు. పూటకో డ్రెస్ తో హైదరాబాద్ గల్లీల్లోనే తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు. ఆటోల్లో ప్రయాణిస్తూ.. పోలిసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు.
Minister Komatireddy: ఘట్కేసర్లోని గట్టు మైసమ్మ దేవాలయాన్ని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వేలాదిగా భక్తులు తరలి వచ్చి అమ్మవారి జాతర దగ్గర మెట్లు, ఇతర మౌళిక వసతులు ఏర్పాటు చేస్తాం.. పేద ప్రజలకు అండగా ఉంటున్న ప్రజా ప్రభుత్వంపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాను అని ఆయన తెలిపారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త పథకాన్ని స్వాగతిస్తున్నాం.. ఉపాధి హామీ కూలీలను ప్రామాణికంగా తీసుకోవడం ఒకే.. కానీ, వ్యవసాయ కూలీలు అని ఎన్నికల్లో హామీ ఇచ్చారు.. ఆత్మీయ భరోసాకు ఆంక్షలు పెట్టడం ఎంత వరకు సమంజసం?.. ప్రభుత్వ ఆంక్షలతో 10 శాతం మందికి మాత్రమే భరోసా.. 90 శాతం పథకానికి దూరం అవుతారు అని పేర్కొన్నారు.
సింగపూర్‌లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో హైదరాబాద్‌లో అత్యాధునిక 1 మిలియన్ చదరపు అడుగుల పార్క్‌ను అభివృద్ధి చేయడానికి రూ. 450 కోట్ల పెట్టుబడిని క్యాపిటల్‌ల్యాండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ ఖియాతానీ ప్రకటించారు.
Harish Rao- Uttam: ప్రతిపక్షం నిలదీస్తే గానీ, ఈ ప్రభుత్వం నిరు పేదల గురించి ఆలోచించదా? అని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు ఇస్తామనే ప్రభుత్వ ప్రకటన బీఆర్ఎస్ విజయం అన్నారు.
MLC Kavitha: నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పసుపు బోర్డు ప్రకటన బీజేపీ కార్యక్రమంలా ఉంది.. పార్లమెంట్ సభ్యురాలిగా తాను ఐదేళ్లు లోక్ సభలో పసుపు బోర్డు కోసం కోట్లాడాను అన్నారు.
నిజామాబాద్ జిల్లా మోపాల్ లో దారుణం చోటు చేసుకుంది. అయితే, రోడ్ బుచ్చన్నతో దగ్గర లక్ష రూపాయల చిట్టీ వేసింది జంగం విజయ. అయితే, చిట్టీ గడువు ముగిసినా.. డబ్బులు చెల్లించడంలేకపోవడంతో అతడిపై డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చింది. పైసల కోసం నా పరువు తీస్తుందేమో అనే కారణంతో బుచ్చన్న తన పాలేరు నగేష్‌తో కలిసి సదరు మహిళను హత్య చేసి పూడ్చి పెట్టారు.
Extramarital Affair: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నానుతండాలో దారుణం చోటు చేసుకుంది. సొంత అన్నను కరెంట్ షాక్ తో తమ్ముడు చంపేశాడు. అయితే, ఈ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది.
Komuravelli Mallanna Jatara 2025: కొంగు బంగారమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి జాతర ఈరోజు (జనవరి 19) నుంచి ప్రారంభం కానుంది. అయితే, సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో ప్రారంభమై ఉగాదికి ముందు వచ్చే ఆదివారం నాడు ముగియనుంది.
Muda Scam: కర్ణాటకలో ముడా కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఇతరులకు చెందిన 300 కోట్ల రూపాయల విలువైన 140 స్థిరాస్థుల్ని అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది.