Rahul Gandhi: సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ దొరికింది. లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీపై చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్ పై దాఖలైన పరువు నష్టం కేసులో ఆయనపై నమోదైన క్రిమినల్ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేస్తున్నట్లు ఈరోజు (జనవరి 20) ప్రకటించింది.
భారత జట్టును ఎంపిక చేయడమంటే సెలక్టర్లకు చాలా కష్టమైన పని.. అందులో 15 మందితో స్క్వాడ్ అంటే ఇంకా ఇబ్బందిగా ఉంటుదని భజ్జీ చెప్పుకొచ్చాడు. కానీ, దేశవాళీలో అదరగొట్టిన వారికి అవకాశం కూడా కల్పించకపోలేకపోయారని వాపోయాడు.
Karnataka: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత పోరు కేవలం కాంగ్రెస్ పార్టీలోనే అనుకున్నాం.. కానీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో లుకలుకలు మొదలు అయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రపై గోకాక్ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారానికి కొన్ని గంటల ముందు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ డీసీలో ఆదివారం నాడు జరిగిన మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడు.. ఈ సందర్భంగా అమెరికాలోకి వలసలపై అతడు దూకుడుగా ఉన్నట్లు తెలిపాడు.
Israel - Hamas: కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్- హమాస్‌లు తమ అధీనంలో ఉన్న బందీలను దశల వారిగా విడుదల చేస్తున్నారు. తమ చెరలోని బందీలుగా ముగ్గురిని హమాస్ రిలీజ్ చేయగా.. ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడిచి పెట్టింది.
Kolkata Doctor Case: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై 2024 ఆగస్టు 9వ తేదీన పోలీసు వాలంటీర్ గా పని చేస్తున్న సంజయ్ రాయ్ దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది.
Trump On TikTok: టిక్‌టాక్ సేవలకు సంబంధించి అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టిక్‌టాక్ కంపెనీలో సుమారు 50 శాతం వాటా యూఎస్ పెట్టుబడిదారుల చేతిలో ఉండేలా కండిషన్ తో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఆ సేవలను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఈరోజు (జనవరి 20) మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే, కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు చేరుకున్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లక్ష్యాన్ని నీరు కార్చొద్దు అన్నారు. అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలని తెలిపారు.
ప్రభుత్వం కొత్త పథకాలు ప్రారంభించినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయని అన్నారు. ఎమ్మెల్సీ కవిత, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇచ్చిన సూచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం.. గత ప్రభుత్వంలో రైతు బంధు దుర్వినియోగం అయ్యింది అని ఆయన ఆరోపించారు. మా సర్కార్ హయంలో కేవలం సాగు చేసే రైతులకు మాత్రమే మేము రైతు భరోసా ఇస్తామన్నారు.