KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ హస్పటల్ కి వెళ్లారు. కేసీఆర్ తో ఆసుపత్రికి కేటీఆర్, హరీష్ రావు వచ్చారు. అయితే, నిన్న కొన్ని టెస్టుల తర్వాత ఈ రోజు మరోసారి ఆసుపత్రికి వెళ్లారు కేసీఆర్.
Gaddar Film Awards: తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత సినీ సంబురాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో సినీ అవార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ హైటెక్స్ వేదికగా జరిగే వేడుకల్లో విజేతలకు అవార్డులను అందించి సత్కరించనున్నారు.
KTR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్‌లోని పలు పబ్‌లలో ఎస్వోటీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్లబ్ రఫ్ పబ్, ఫ్రూట్ హౌస్ లో పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల సమయంలో పబ్‌లోని యువత మత్తులో జోగుతున్నారు.
Phone Tapping Case: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నేతలే టార్గెట్ గా పని చేసినట్లు తెలుస్తుంది.
Heavy Rain: హైదరాబాద్ మహా నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. గ్రేటర్ పరిధిలోని నార్త్, సౌత్ ప్రాంతాల్లో మరో 2 గంటల పాటు ఈ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, నాగోల్, దిల్ సుఖ్ నగర్, అంబర్ పేట, హయత్ నగర్, చైతన్యపురి, హబ్సిగూడ, బషీర్ బాగ్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన 265 మంది మృతదేహాలకు సివిల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం కొనసాగుతుంది. అయితే, విమాన ప్రమాదంలో ఛిద్రమైన కొన్ని మృతదేహాలు.. వారి కుటుంబ సభ్యుల డీఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తిస్తున్నారు.
Air India Place Crash: తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్ఎన్ రెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ.. అహ్మదాబాద్ విమాన ప్రమాదం సాంకేతిక సమస్య వల్ల జరిగింది అన్నారు.
Air India Flight: గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన మరిచిపోక ముందే.. ఇంతలో మరో ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపుతుంది.
MLA Kunamneni: సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే ఎడ్ల గురువా రెడ్డి14 వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చలు నడిపేందుకు సిద్ధంగా ఉంది.. కానీ నక్సలైట్స్ తో చర్చలకి ముందుకు రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.