దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి నివాసంలో ఐటీ రైడ్స్ ముగిశాయి. ఆమె నివాసంలో లాకర్స్ తో పాటు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిన్నటి నుండి దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి నివాసంలో ఈ రైడ్స్ జరుగుతున్నాయి. ఆమె నివాసంలో రైడ్స్ ముగించుకుని ఐటీ అధికారులు వెళ్ళిపోయారు. నిన్న ఉదయం దిల్ రాజు కుమార్తె ఇంటికి నాలుగు ఐటి బృందాలు చేరుకున్నాయి. అప్పటినుంచి ఆమె నివాసంలో రైట్స్ జరుగుతూనే ఉన్నాయి.
సైఫ్ అలీఖాన్‌ను లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ కోరిక నెరవేరింది. భజన్ సింగ్ రాణా అనే ఆటో డ్రైవర్ని డిశ్చార్జ్ చేయడానికి ముందు సైఫ్ కలుసుకుని కౌగిలించుకున్నాడని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇంతకుముందు డ్రైవర్ ఇంటర్వ్యూలో సైఫ్ ను తాను ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఆయన్ను కలిసి అవకాశం దొరకలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తాను ఆసుపత్రికి తీసుకువెళ్లింది నటుడు సైఫ్ అలీఖాన్ అని ఆటో డ్రైవర్ కి తెలియదట.
స్టార్ డైరెక్టర్ ఇటీవల పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుకుమార్ ఇంట ఐటి రైడ్స్ జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతున్న పలువురు నిర్మాతల ఇళ్లపై ఐటి రైడ్స్ లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అధికారులు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవి శంకర్ లను ప్రశ్నించారు. ఇక పుష్ప 2 సినిమా డైరెక్ట్ చేసినందుకు సుకుమార్ రెమ్యునరేషన్ తీసుకోకుండా […]
సత్య చిత్రంపై నా కన్ఫెషన్ నోట్‌కు కొనసాగింపుగా, నేను ఎప్పటికైనా అతిపెద్ద చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నాను ఆ సినిమా పేరు సిండికేట్ అంటూ పేర్కొన్నారు రామ్ గోపాల్ వర్మ. ఇది భారతదేశ అస్తిత్వానికే ముప్పు కలిగించే భయంకరమైన సంస్థ గురించి అని అంటూ రాసుకొచ్చాడు. 70వ దశకం వరకు విజృంభించిన స్ట్రీట్ గ్యాంగ్‌లు కరడుగట్టిన రాజకీయ పార్టీలలోకి ప్రవేశించాయి. తరువాత ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం మొదలైన వాటికి విపరీతమైన డిమాండ్ కారణంగా స్మగ్లర్లు పెరిగినప్పుడు, వాటిని కూడా […]
పటాస్ సినిమాతో దర్శకుడుకే పరిచయమైన అనిల్ రావిపూడి ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈమధ్య సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన సంక్రాంతికి వస్తున్నాంతో హిట్టు కొట్టిన ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. తాజాగా మీడియాతో ముచ్చటించిన సందర్భంగా ఇదే ప్రశ్న ఆయనకు ఎదురైంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి స్పందిస్తూ చిరంజీవి గారి సినిమా గురించి మాట్లాడడం టూ ఎర్లీ అవుతుంది. […]
పటాస్ సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అనిల్ రావిపూడి అతి తక్కువ సమయంలో సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా అవతరించాడు. ఆయన దర్శకుడిగా మారి 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈరోజు మీడియాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. పటాస్‌తో మొదలుపెట్టి ఇటీవల రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. 10 ఏళ్ల వ్యవధిలో ఎనిమిది సినిమాలు ఫ్లాప్ లేకుండా పూర్తి చేయడం గమనార్హం. […]
దాడి కారణంగా హాస్పిటల్ లో జాయిన్ అయిన సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు ఇంటికి వచ్చాడు. నటుడు మంగళవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. గత వారం, బుధవారం అర్ధరాత్రి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి అతనిపై దాడి చేశారు. నటుడికి 2 శస్త్రచికిత్సలు జరిగాయి. ఇప్పుడు మంగళవారం ఒక అప్డేట్ తెర మీదకు వచ్చింది. అదేమంటే సైఫ్ గట్టి పట్టు నుండి తనను తాను విడిపించుకోవడానికి నిందితులు నటుడిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి తర్వాత, […]
బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప’లో ప్రధాన పాత్రధారి పుష్పాకి విలన్ గా నటించిన పోలీస్ ఆఫీసర్ ‘షెకావత్’ సార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ‘షెకావత్’ సార్ వేషంలో కానిస్టేబుల్ యూనిఫాంలో సిగరెట్ తాగుతూ కనిపించారు. విశేషమేమిటంటే సినిమాలోని ఎస్పీ షెకావత్ పాత్ర నుండి ప్రేరణ పొంది తన కొత్త స్టైల్లో కనిపించాడు. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే, ప్రజలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న […]
మాలీవుడ్ భామలకు టాలీవుడ్ లో ఉండే క్రేజే వేరు.. ఆ జాబితాలో రీసెంట్లీ జాయిన్ అయ్యింది కేరళ కుట్టీ సంయుక్త మీనన్. భీమ్లా నాయక్ తో టాలీవుడ్ లో ఏ ముహుర్తాన అడుగుపెట్టిందో కానీ.. హ్యాట్రిక్ హీరోయిన్ గా మారి.. ప్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్స్ ఇచ్చి గోల్డెన్ లెగ్ అయ్యింది. పనిలో పనిగా రెమ్యునరేషన్ పెంచేసింది. మరీ ఆ భామకు ఉన్న డిమాండ్ అట్లాంటిది. విరూపాక్షతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ మలయ […]
ప్రముఖ నటి ప్రియాంక చోప్రా చిలుకూరు బాలాజీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ శివారులో ఉన్న చిలుకూరు బాలాజీ స్వామివారిని వీసాల దేవుడిగా కూడా చెబుతారు. పెళ్ళాడి అమెరికాలో నటి ప్రియాంక చోప్రా బాలాజీని దర్శించుకొని, ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. Naga Chaitanya : నాగచైతన్య తర్వాత సినిమా కోసం బాలీవుడ్ విలన్..? […]