పటాస్ సినిమాతో దర్శకుడుకే పరిచయమైన అనిల్ రావిపూడి ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈమధ్య సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన సంక్రాంతికి వస్తున్నాంతో హిట్టు కొట్టిన ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. తాజాగా మీడియాతో ముచ్చటించిన సందర్భంగా ఇదే ప్రశ్న ఆయనకు ఎదురైంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి స్పందిస్తూ చిరంజీవి గారి సినిమా గురించి మాట్లాడడం టూ ఎర్లీ అవుతుంది. కనీసం ఇటుకలు వేసి బేస్ కూడా వేయలేదు, జస్ట్ ఇంకా టాక్స్ లోనే ఉన్నాం.
Anil Ravipudi: అనిల్ రావిపూడి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇదేనట!
ఎలాంటి జానార్ చేయాలి? ఎలాంటి సెటప్ లో చేయాలి? సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వస్తున్న సినిమా కాబట్టి నేను నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే చిరంజీవి గారి లాంటి ఒక ఇమేజ్ ఉన్న స్టార్ తో చేస్తున్నప్పుడు ఆయన స్ట్రెంత్ ఏంటి? ఆయన ఇప్పటివరకు చేయని జానర్స్ ఏమైనా ఉన్నాయా? ఆయన చేయని జానర్స్ ఏమైనా పట్టుకోవచ్చా? ఆయన ఈ మధ్యకాలంలో అటెండ్ చేయని బ్యాక్ డ్రాప్స్ ఏమైనా ఉన్నాయా? లాంటివి పట్టుకుందాం, అని బేసిక్ హోం వర్క్ జరుగుతోంది. కచ్చితంగా 100% అందరూ ఊహించినట్టే, ఊహించిన దాని కంటే కూడా ఎక్కువగా చిరంజీవి గారిని ప్రజెంట్ చేయాలని భావిస్తున్నాం. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మూడు పాటలు ఉన్నాయి కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో ఐదు పాటలు ఆయనకు తగ్గట్టుగా ప్లాన్ చేస్తామని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఇక తన కెరీర్ లో నాగార్జునతో కూడా ఒక సినిమా ఖచ్చితంగా 100% చేస్తానని ఆయన కామెంట్ చేశారు.