సోనీ లివ్ తమ తాజా డాక్యుమెంటరీ-డ్రామా సిరీస్ బ్లాక్, వైట్ అండ్ గ్రే – లవ్ కిల్స్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లోని సంక్లిష్టమైన కథాంశాన్ని, ఆలోచనను రేకెత్తించే అంశాలను సమర్థవంతంగా చూపిస్తూ ట్రైలర్ రూపొందింది. మే 2 నుంచి సోనీ లివ్‌లో ప్రసారం కానున్న ఈ సిరీస్, ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కథ ఒక ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం నుంచి వచ్చిన యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతనితో ముడిపడిన హత్యల రహస్యాలను […]
‘డియర్ ఉమా’ అనే సినిమాను నిర్మిస్తూ, హీరోయిన్గా నటిస్తున్న సుమాయా రెడ్డి ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే, కీలక నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డితో ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వార్తల్లో నిలిచారు. ఈ వీడియోను వైసీపీ వ్యతిరేక సోషల్ మీడియా వర్గాలు దురుద్దేశంతో వాడుకుని, సుమాయా రెడ్డికి, ఎమ్మెల్యేకి అఫైర్ ఉందంటూ దుష్ప్రచారం చేశాయి. దీనిపై తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా స్పష్టతనిచ్చారు. అలాగే, సుమాయా రెడ్డి కూడా […]
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కథానాయకుడి తల్లి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పాతో కలిసి నిర్మించారు. ఇంతకుముందు సునీల్ ‘ఓం భీమ్ బుష్’ (శ్రీ విష్ణు), ‘మా నాన్న సూపర్ హీరో’ (సుధీర్ బాబు) వంటి చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా సందర్భంగా సునీల్ బలుసు, అశోక్ […]
రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నసినిమా “ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్”. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. “ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్” సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ మూవీ నుంచి ‘ఏదో ఏదో..’ లిరికల్ […]
తమిళ సినిమా పరిశ్రమలో శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. వీరిద్దరి తాజా సినిమా మదరాసి హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజువల్ వండర్‌గా అద్భుత స్థాయిలో సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన సినిమా గ్లింప్స్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా, సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మదరాసి సెప్టెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. […]
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ప్రస్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 25రోజుల పాటు కంటిన్యూగా జరగనున్న ఈ షెడ్యూల్లో విలక్షణ పాత్రలతో హీరోయిన్గా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న బిందు మాధవి […]
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ప్రతిష్టాత్మక పార్క్ హయత్ హోటల్లో సోమవారం (ఏప్రిల్ 14, 2025) ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో దట్టమైన పొగలు హోటల్‌ను ఆవరించాయి. ఈ ఘటనతో హోటల్లో ఉన్నవారిలో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇక ఈ హోటల్లో ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ టీమ్ […]
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా ‘తు మేరా లవర్’ను విడుదల చేశారు. ప్రోమోతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ‘తు మేరా లవర్’ […]
సినీ పరిశ్రమలో ప్రేమ కథలు, బ్రేకప్‌లు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాయి. ఇటీవలి కాలంలో నటి తమన్నా భాటియా -నటుడు విజయ్ వర్మల మధ్య బ్రేకప్ గురించి ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని, ఒకరితో ఒకరు సమయం గడుపుతూ సంతోషంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే, హోలీ సమయంలో వీరి సంబంధం ముగిసిన సమాచారం అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తమన్నా స్వయంగా ఈ బ్రేకప్ విషయాన్ని పరోక్షంగా వెల్లడించడంతో, ఈ వార్త […]
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘దేవర’ జపాన్ ప్రమోషన్స్, ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్, ‘అర్జున్ సన్నాఫ్’ వైజయంతి ప్రీ రిలీజ్ మీట్లలో ఎన్టీఆర్ బక్కచిక్కిన రూపంలో కనిపించడంతో, కొన్ని మీడియా వర్గాలు ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని వార్తలు వండి వార్చాయి. అయితే, అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఎన్టీఆర్ కొత్త లుక్ వెనుక ఉన్న రహస్యం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ‘డ్రాగన్’ సినిమా […]