Dandora: ‘దండోరా’ సెకండ్ షెడ్యూల్లో బిందు మాధవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ప్రస్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 25రోజుల పాటు కంటిన్యూగా జరగనున్న ఈ షెడ్యూల్‌లో విలక్షణ పాత్రలతో హీరోయిన్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న బిందు మాధవి భాగమయ్యారు. ఇందులో ఆమె వేశ్య పాత్రలో నటిస్తున్నారు. ఎమోషనల్ టచ్‌తో ఉంటూ ఆలోచింప చేసేలా ఆమె పాత్ర ఉంటుంది. ఇప్పటికే ఈ షెడ్యూల్‌లో వెర్సటైల్ యాక్టర్ శివాజీ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బిందు మాధవి కూడా జాయిన్ కావటం విశేషం.
ఫస్ట్ బీట్ వీడియోతో అంచనాలు పెంచుకున్న దండోరా సినిమా సామాజిక స్పృహను కలిగించే అంశంతో తెరకెక్కుతోంది. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని దండోరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. విలక్షణ నటుడు శివాజీతో పాటు నవదీప్, నందు, బిందు మాధవి, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య తదితరులు..ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
- WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
ప్రముఖ సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. వెంకట్ ఆర్.శాఖమూరి సినిమాటోగ్రఫీ, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్, క్రాంతి ప్రియమ్ ఆర్ట్ డైరెక్టర్, రేఖ బొగ్గారపు కాస్ట్యూమ్ డిజైనర్, ఎడ్వర్డ్ పేరజీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అనీష్ మరిశెట్టి కో ప్రొడ్యూసర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.
తాజావార్తలు
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
-
WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
ట్రెండింగ్
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!