సినీ పరిశ్రమలో ప్రేమ కథలు, బ్రేకప్‌లు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాయి. ఇటీవలి కాలంలో నటి తమన్నా భాటియా -నటుడు విజయ్ వర్మల మధ్య బ్రేకప్ గురించి ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, ఒకరితో ఒకరు సమయం గడుపుతూ సంతోషంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే, హోలీ సమయంలో వీరి సంబంధం ముగిసిన సమాచారం అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తమన్నా స్వయంగా ఈ బ్రేకప్ విషయాన్ని పరోక్షంగా వెల్లడించడంతో, ఈ వార్త మరింత హాట్ టాపిక్‌గా మారింది. తమన్నా భాటియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియా లేదా మీడియా ముందు ఎక్కువగా చర్చించడానికి ఇష్టపడరు.
Jr NTR: ఎన్టీఆర్ బక్క చిక్కడానికి అనారోగ్యమే కారణమా?
ఈ బ్రేకప్ తర్వాత ఆమె ఇప్పుడిప్పుడే ఈ ఎమోషన్ స్టేజ్ నుంచి బయటపడుతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. తమన్నా తన కెరీర్‌పై దృష్టి సారించి, కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ మళ్లీ తన సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. ఆమె సినిమాల్లోని హుషారైన తమన్నాగా మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల తమన్నాను మీడియా పెళ్లి గురించి ప్రశ్నించింది. “ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు?” అనే ప్రశ్నకు తమన్నా కాస్త అసహనంతో స్పందించారు. “ఇప్పట్లో నాకు పెళ్లి గురించి ఆలోచన లేదు,” అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చారు. తమన్నా త్వరలో ఓదెల 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.