సూపర్ స్టార్ రజనీకాంత్‌కి అత్యంత సమీప బంధువైన అనిరుద్ రవిచందర్ ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ కంపోజర్‌గా ఉన్నాడు. తమిళంలో కెరీర్ మొదలుపెట్టిన అనిరుద్ ఇప్పుడు తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. నిజానికి రజనీకాంత్ అంటే అనిరుద్‌కి ప్రత్యేక అభిమానం.
Also Read : Hari Hara Veera Mallu: చివరి నిముషంలో ‘ఒడ్డున’ పడేసిన ఆ ఇద్దరు నిర్మాతలు!
బంధువు కావడంతో పాటు తన కెరీర్ సెట్ కావడానికి ఆయనే కారణమని భావిస్తూ ఉన్న అనిరుద్, ఆయన అంటే స్పెషల్ ట్యూన్స్ ఇస్తూ స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటాడు. అయితే తాజాగా కూలీ సినిమాకి అనిరుద్ ఇచ్చిన సాంగ్ ఇప్పుడు కాపీ ఆరోపణలు ఎదుర్కొంటుంది. తాజాగా పవర్ హౌస్ అనే ఒక సాంగ్ రిలీజ్ చేశారు. దానికి అమెరికన్ రాపర్ లిల్ నాస్ ఎక్స్ చేసిన 2021 ఇండస్ట్రీ బేబీ సాంగ్ దగ్గరగా ఉందని అంటున్నారు.
Also Read : Hari Hara Veera Mallu: నిజంగా అంత ఖర్చు అయ్యిందంటారా?
ఆ బీట్ కానీ, మొత్తం ట్యూన్ కానీ, ఆ రాప్ స్ట్రక్చర్ కానీ దాదాపుగా అలాగే ఉన్నాయని, ఏమాత్రం మార్పులు చేర్పులు లేకుండా డైరెక్ట్‌గా కాపీ చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు అనిరుద్‌గానీ, ఆయన టీం గానీ స్పందించలేదు. ఇక కూలీ సినిమాని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందించగా, ఆగస్టు 14వ తేదీన సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది.