VijayaSaiReddy: విజయసాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్.. పోయిందా? పడేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VijayaSaiReddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యక్తిగత ఫోన్ పోయిందంటూ ఆయన వ్యక్తిగత కార్యదర్శి లోకేశ్వరరావు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఈనెల 21న ఫోన్ పోయిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విజయసాయిరెడ్డి ఫోన్ ఎక్కడ ఉందో పోలీసులు వెదుకుతున్నారు. విజయసాయిరెడ్డి లెటెస్ట్ వెర్షన్ ఐ ఫోన్ వాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ ఆయన్ను వందలాది మంది కార్యకర్తలు కలుస్తుంటారు. మరోవైపు పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయసాయిరెడ్డి ఎక్కువగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఆయన ఫోన్ మిస్ అయి ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
Read Also: Tomota Prices: అక్కడ రూపాయి.. ఇక్కడ రూ.20.. మధ్యలో లాభం ఎవరికి?
Also Read
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
అయితే విజయసాయిరెడ్డి ఫోన్ పోలేదని.. కావాలనే ఆయన ఫోన్ మిస్ అయినట్లు నటిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి సోదరుడు శరత్ చంద్రారెడ్డిని పోలీసులు విచారిస్తున్న సమయంలో ఇలా జరగడం వెనుక పెద్ద కథే ఉందని వివరిస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో తాడేపల్లి ప్యాలెస్ పూసాలు కదులుతున్నాయని.. అందుకే విజయసాయిరెడ్డి తన ఫోన్ పడేసుకున్నారని ఆరోపించారు. ఫోన్‌ను దాచుకుని తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అటు ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డికి నోటీసులు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఈ మిస్సింగ్ ఫిర్యాదును ఉపయోగించి ఆయన ఫోన్ తనిఖీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఏ 2 ఫోన్ పోలేదు… పడేసాడు.
ఢిల్లీ లిక్కర్ స్కాం తో తాడేపల్లి ప్యాలస్ పూసాలు కదులుతున్నాయి.— Ayyanna Patrudu (@AyyannaPatruduC) November 23, 2022
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి