తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. అర్ధరాత్రి సమయంలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ సమీపంలో గ్రీనరీకి దుండగులు నిప్పుపెట్టారు. గతంలో ఇదే తరహాలో రెండు అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను తక్షణమే అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో వైసీపీ కార్యాలయ వర్గాలు తాడేపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
VijayaSaiReddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యక్తిగత ఫోన్ పోయిందంటూ ఆయన వ్యక్తిగత కార్యదర్శి లోకేశ్వరరావు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఈనెల 21న ఫోన్ పోయిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విజయసాయిరెడ్డి ఫోన్ ఎక్కడ ఉందో పోలీసులు వెదుకుతున్నారు. విజయసాయిరెడ్డి లెటెస్ట్ వెర్షన్ ఐ ఫోన్ వాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ ఆయన్ను వందలాది మంది కార్యకర్తలు కలుస్తుంటారు. మరోవైపు పార్టీ ప్రధాన కార్యాలయంలో…