YSRCP: విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి జగన్ ప్రభుత్వం పేరు మార్చడంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే బాలయ్యకు వరుసగా మంత్రులందరూ కౌంటర్లు ఇస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మంత్రులు ట్వీట్లు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎప్పుడు పెట్టారో చెప్పాలని బాలయ్యను మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. మీరంతా కలిసి చంపేశాకే కదా.. చేసిన పాపం పేరు పెడితే పోతుందా అంటూ నిలదీశారు.…