Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయి.. ట్యాపింగ్ ఆరోపణలు చేసిన కోటంరెడ్డిపై ఎదురుదాడికి దిగిన వైసీపీ.. ఆ తర్వాత పక్కన పెట్టేంది.. అయితే.. ఇప్పుడు కోటంరెడ్డికి కార్పొరేటర్లు షాక్ ఇస్తున్నారు. ఇంతవరకు ఆయనకు మద్దతుగా నిలిచిన జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు, 23 డివిజన్ కార్పొరేటర్ మొయిల్ల గౌరీతోపాటు మరో కార్పొరేటర్ మూలే విజయ భాస్కర్ రెడ్డిలు.. కొత్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జ్‌గా వచ్చిన ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డికి మద్దతు ఇస్తామని ప్రకటించారు. తాము వైయస్సార్ అభిమానులమని మొదటనుంచి వైఎస్ జగన్ కు మద్దతుగా ఉన్నామన్నారు. పార్టీ ప్రయోజనాలజిస్ట్రా ఆదాల వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. కార్యాలయంలో కోటంరెడ్డి ఫ్లెక్సీలను కార్యకర్తలు చించి వేశారు.. ఈ విషయం తెలియడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పడారుపల్లిలోని విద్యా భాస్కర్ ఇంటికి వెళ్లి ఆయనను బెదిరించినట్టు కార్యకర్తలు తెలిపారు ఈ సమాచారం తెలియడంతో ఆదాల వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు చేరుకొని విజయ్ భాస్కర్ రెడ్డి వద్ద వివరాలు సేకరించారు.. పోలీస్ స్టేషన్ కు పిలిచి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. కోటంరెడ్డి పై కేసు నమోదు చేయాలని విజయ భాస్కర్ అనుచరులు పోలీసులను కోరారు.
Read Also: Jagananna ku chebutaam: ఏపీలో మరో కొత్త కార్యక్రమం.. జగనన్నకు చెబుదాం..
ఈ ఘటనపై కార్పొరేటర్ విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. నా కార్యాలయంలో ఉన్న కోటంరెడ్డి ఫ్లెక్సీని తొలగించాను.. ఈ విషయం తెలియడంతో ఆయన నన్ను ఫోన్లో బెదిరించారు.. అంతు చూస్తాను.. నగరంలో ఎలా తిరుగుతావో చూస్తానంటూ బెదిరించారని.. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చి నన్ను భయభ్రాంతులకు గురి చేశారని చెప్పుకొచ్చారు.. ఆయన డ్రైవర్ ఏకంగా మా బెడ్ రూమ్ లోకి వచ్చి బయటికి రావాలని బెదిరించాడు.. నేను జగన్ కు విశ్వాసపాత్రుడిని.. ఆయనతోనే ఉంటాను అని ప్రకటించారు.. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు జగన్ తోనే ఉంటానని స్పష్టం చేసిన ఆయన.. పోలీసులకు కూడా జరిగిన విషయంపై ఫిర్యాదు చేశా.. ఏమి చేసుకుంటారో చేసుకోండి అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను.. కోటంరెడ్డి మా పార్టీ వదిలేసి టీడీపికి లోకి వెళ్తున్నారు.. నేను సర్వం పోగొట్టుకొని రాజకీయాలు చేస్తున్నానని తెలిపారు విజయ భాస్కర్ రెడ్డి.