Jagananna ku chebutaam: ఏపీలో మరో కొత్త కార్యక్రమం.. జగనన్నకు చెబుదాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagananna ku chebutaam: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పటికే ఎన్నో పథకాలతో సామాన్యులకు చేరువైన ప్రభుత్వం.. ఇక, జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి సిద్ధమైంది.. ఇవాళ జగనన్నకు చెబుదాం సన్నాహకాలపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం జగన్.. వినతులను సంతృప్తస్థాయిలో పరిష్కరించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.. స్పందన కార్యక్రమంలో భాగంగా అత్యధిక అర్జీలు అందుకుంటున్న ప్రభుత్వ విభాగ అధిపతులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు.. అర్జీల పరిష్కారంలో అనుసరించాల్సిన విధానాలపై సమగ్ర చర్చ సాగిస్తారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభానికి అధికారులు సన్నద్ధం కావాలని ఆదేశించారు.. ప్రతి ప్రభుత్వ విభాగాధిపతి ప్రతి వినతిని పరిష్కారం అయ్యేంతవరకూ ట్రాక్ చేయాలి, అందిన అర్జీలపై ప్రతి వారం కూడా ఆడిట్ చేయాలి. దీనిపై ప్రతి వారం కూడా నివేదికలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాకింగ్, పర్యవేక్షణ జరుగుతుందా? లేదా? అన్నదానిపై ప్రతివారం కూడా సమీక్ష చేయాలన్నారు. అలా అయితేనే.. కార్యక్రమం సవ్యంగా సాగుతుందని తెలిపారు.
Read Also: Mahesh Kumar Goud : ఇంత అవమానాన్ని గురైన గవర్నర్ ఇలా మాట్లాడుతుందని అనుకోలేదు
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
వివిధ ప్రభుత్వ విభాగాల్లో అర్జీలు, ఫిర్యాదుల స్వీకరణకు ఇప్పటికే ఉన్న కాల్ సెంటర్లను అనుసంధానం చేయాలని సూచించారు సీఎం జగన్.. వివిధ విభాగాల్లో వినతుల పరిష్కారం కోసం ఇప్పటివరకూ ఉన్న పద్ధతులను మరోసారి పరిశీలించి, తిరిగి పునర్నిర్మాణం చేయాలి.. సీఎంవోతోపాటు ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా జగనన్నకు చెబుదాం ప్రాజెక్ట్ మానిటరింగ్ విభాగాలు ఉండాలి. తర్వాత జిల్లాస్థాయిలోనూ, మండలస్థాయిలో కూడా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి మానిటరింగ్ యూనిట్లు మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల స్థాయిలో కూడా ఉండాలి. మానిటరింగ్ యూనిట్లు సమర్థవంతంగా పనిచేస్తేనే కార్యక్రమం బాగా జరుగుతుంది, స్పందనకు అత్యంత సమర్థవంతమైన, మెరుగైన విధానమే ‘‘ జగనన్నకు చెబుదాం’’ ఉద్దేశంగా స్పష్టం చేశారు. సంబంధిత విభాగంలో సరిగ్గా పని జరగలేదనే కారణంతోనే వినతులు, ఫిర్యాదులు వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో వారిని సంతృప్తి పరిచేలా పరిష్కారం చూపడం అన్నది సవాల్‌తో కూడుకున్నది.. సహనం, ఓపిక, పునఃపరిశీలన, విధానాల పునర్నిర్మాణాలతో ముందుకు సాగాలన్నారు. స్పందన డేటా ప్రకారం అత్యధికంగా ఫిర్యాదులు రెవిన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, హోంశాఖ, ఆరోగ్యం–కుటుంబ సంక్షేమ శాఖల నుంచి వస్తున్నాయి. జగనన్నకు చెబుదాం ప్రారంభమైన తర్వాత ఇవే విభాగాలనుంచి వినతులు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని.. ఈ శాఖలకు చెందిన విభాగాధిపతులు అర్జీల పరిష్కారంపై మరింత దృష్టిపెట్టాల్సి ఉంటుందన్నారు.
Read Also: Ambika Krishna: అంబికాకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. చంద్రబాబు ఏనాడు స్పందించలేదు..
జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై సిబ్బందికి ఓరియెంటేషన్ ఇవ్వాలని సూచించారు సీఎం.. మానిటరింగ్ యూనిట్లు ఏర్పాటుపైకూడా మార్గదర్శకాలు రూపొందించాలి.. నిర్దేశిత సమయంలోగా వినతులు పరిష్కారం కావాలి, ఆ సమయంలోగా పరిష్కారం కావడం, పరిష్కారంలో నాణ్యత ఉండడం అన్నది చాలా ముఖ్యంగా చెప్పుకొచ్చారు. పరిష్కారం అయిన తర్వాత వినతులిచ్చిన వారి నుంచి లేఖ తీసుకోవాలన్నారు. పలానా అర్జీని తిరస్కరించాల్సిన నేపథ్యంలో అక్కడ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.. తిరస్కరణకు గురైనా జరిగిన ప్రక్రియపై అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేసేలా ఉండాలి.. అవినీతికి సంబంధించి అంశాలను చాలా గట్టిగా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తప్పు చేయడానికి భయపడే పరిస్థితి ఉండాలి.. పోలీసులకు వచ్చే అర్జీల పరిష్కారానికి మండల స్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో కూడిన మండల/ మున్సిపల్ స్ధాయి సమన్వయ కమిటీ ప్రతివారం సమావేశం కావాలి.. వారంలో ఒకరోజు సమావేశమై అర్జీల పరిష్కారంపై దృష్టిపెట్టాలని.. ప్రభుత్వ విభాగాధిపతులు త్వరలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించి.. వారికీ అవగాహన కల్పించాలి సూచించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!