ఏపీలో జూన్ 1 సందర్భంగా పెన్షన్ల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. బుధవారం తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు. సుమారు 60.75 లక్షల మంది పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం రూ.1,543.80 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పెన్షన్ల పంపిణీ వివరాలను అందజేశారు.
ఉదయం 7 గంటల వరకు 30.01 శాతం పెన్షన్ల పంపిణీ ద్వారా వాలంటీర్లు సుమారు 18.22 లక్షల మందికి రూ.461.92 కోట్లు అందజేశారు. అలాగే.. ఉదయం 8 గంటల వరకు 48.27 శాతం పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ మేరకు 29.32 లక్షలమందికి రూ.744.02 కోట్లు అందజేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 78.80 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. 47.88 లక్షల మందికి రూ.1216.54 కోట్లు అందచేసినట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ముత్యాల నాయుడు తెలిపారు.