Pulivendula Violence: కడప జిల్లాలోని పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల రాము ఎన్నికల ప్రచారంలో ఉండగా.. వైసీపీ నేతల వాహనాన్ని కారుతో ఢీ కొట్టి.. ఆపై రాడ్లతో టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
Read Also: Uttarakhand Floods: ఉధృతంగా పోటెత్తిన గంగమ్మ.. శివుని చెంతకు చేరిక!
ఈ ఘటనలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల రాము వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వేముల రాము పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఇక, ఈ సంఘటనపై పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘర్షణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.