BJP MLA Adinarayana Reddy: కూటమిలో జడ్పీ పీఠం చిచ్చు.. రాజీనామాకు ఎమ్మెల్యే సహా 20 మంది కౌన్సిలర్లు, 17 మంది ఎంపీటీసీలు రెడీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA Adinarayana Reddy: ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమిలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవి వ్యవహారం కూటమి పార్టీల మధ్య రాజకీయ చిచ్చు రేపుతోంది. జడ్పీ చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించాలని మొదటి నుంచి పట్టుబడుతున్న జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ పదవిని టీడీపీకి చెందిన పుత్తా నరసింహారెడ్డికి కేటాయించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆది.. తనతో పాటు పలువురు బీజేపీ ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తమ్ముడి కుమారుడికి జడ్పీ చైర్మన్ పదవి ఆశించిన ఆది!
కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయిస్తారని ఆదినారాయణ రెడ్డి ఆశించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన తమ్ముడి కుమారుడు రాజేష్ రెడ్డికి ఈ పదవిని ఇప్పించాలని ఆయన ప్రయత్నించినట్లు సమాచారం. అయితే కూటమి నాయకత్వం ఈ పదవిని టీడీపీకి చెందిన పుత్తా నరసింహారెడ్డికి కేటాయించింది. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో ఆదినారాయణ రెడ్డి విభేదించినట్లు ప్రచారం జరుగుతోంది. జడ్పీ చైర్మన్ పదవిని బీజేపీకి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
Also Read
- MP YS Avinash Reddy Arrest: కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..
- Minister Ramprasad Reddy: గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాస్ వార్నింగ్.. నేరుగా తేల్చుకుందాం..!
- Kadapa Controversy: రాజకీయ నేత కోసం వెంకన్న పోస్టరా? కడపలో వైరల్‌గా మారిన ఫొటో!
- Independent Candidate Victory: జనసేనకు ఝలక్.. 373 ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం..!
స్థానిక ఎన్నికల్లో కష్టపడినా గుర్తింపు లేదా?
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జిల్లాలో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఆదినారాయణ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. పులివెందుల ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల విజయ బాధ్యతలను దగ్గరుండి పర్యవేక్షించడంతో పాటు జమ్మలమడుగు, యర్రగుంట్ల రెండు మున్సిపాలిటీల్లోనూ బీజేపీ విజయానికి కృషి చేశారని పేర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో తన సేవలను ఉపయోగించుకుని, ఇప్పుడు జడ్పీ చైర్మన్ పదవి విషయంలో బీజేపీకి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
విజయవాడకు బయలుదేరిన ఆదినారాయణ రెడ్డి
జడ్పీ చైర్మన్ పదవి దక్కకపోవడంతో తన అసంతృప్తిని కూటమి నాయకత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆదినారాయణ రెడ్డి కడప జిల్లా నుంచి విజయవాడకు బయలుదేరారు. ఆయనతో పాటు జమ్మలమడుగు, ముద్దనూరు, యర్రగుంట్ల ప్రాంతాలకు చెందిన బీజేపీ జడ్పీటీసీలు కూడా విజయవాడకు వెళ్లినట్లు సమాచారం. మరికొద్దిసేపట్లో విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా.. ఆయన బాటలో ప్రజాప్రతినిధులు?
జడ్పీ చైర్మన్ పదవి విషయంలో తనకు అన్యాయం జరిగిందని భావిస్తున్న ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆయనతో పాటు ముగ్గురు బీజేపీ జడ్పీటీసీలు కూడా తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా జమ్మలమడుగు మున్సిపాలిటీకి చెందిన సుమారు 20 మంది కౌన్సిలర్లు, 17 మంది ఎంపీటీసీలు, ఇద్దరు మండల అధ్యక్షులు, ఇద్దరు మండల ఉపాధ్యక్షులతో కూడా రాజీనామా చేయించే దిశగా ఆది ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మధ్యాహ్నం పుత్తా నరసింహారెడ్డి ప్రమాణ స్వీకారం
మరోవైపు కడప జిల్లా పరిషత్ నూతన చైర్మన్‌గా పుత్తా నరసింహారెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టేందుకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. అదే సమయంలో ఆదినారాయణ రెడ్డి విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించనుండటంతో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా ఇప్పటివరకు కడప జిల్లాలో కూటమి తరఫున కీలకంగా వ్యవహరించిన ఆదినారాయణ రెడ్డి అసంతృప్తి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ తరఫున గెలిచిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులను తన వెంట తీసుకెళ్లినట్లు వస్తున్న వార్తలు కూటమి నాయకత్వానికి కొత్త తలనొప్పిగా మారాయి. ఆయన నిజంగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? ఆయనతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా చేస్తారా? లేక కూటమి పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
BJP MLA Adinarayana Reddy: కూటమిలో జడ్పీ పీఠం చిచ్చు.. రాజీనామాకు ఎమ్మెల్యే సహా 20 మంది కౌన్సిలర్లు, 17 మంది ఎంపీటీసీలు రెడీ..?
-
Ramayana Part 2: రణ్‌బీర్, యష్ కాదు.. పార్ట్ 2లో ప్రధాన ఆకర్షణ ఆయనే.. ఆసక్తికర విషయాలు చెప్పిన అజింక్య!
-
Chanakya Niti: ఈ 5 రకాల మనుషులతో జాగ్రత్త.. చాణక్య నీతి హెచ్చరిక..
-
Tamil Nadu vs AP: తమిళనాడు రహస్యాలు ఏపీకి లీక్? విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. 15 మంది ఉద్యోగులపై వేటు!
-
Kantar BrandZ 2026: ఎయిర్టెల్ నంబర్ 1.. మరి జియో ఎక్కడ? కాంతార్ 2026 ర్యాంకింగ్స్‌లో ఆసక్తికర ట్విస్ట్!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!