Minister Ramprasad Reddy: గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాస్ వార్నింగ్.. నేరుగా తేల్చుకుందాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ramprasad Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అండర్‌గ్రౌండ్ రాజకీయాలు మానుకోవాలని, దమ్ముంటే నేరుగా రావాలని సవాల్ విసిరారు. నాలుగు రోడ్ల కూడలిలో ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయచోటి రాజకీయాల్లో అనవసర ఉద్రిక్తతలు సృష్టించవద్దని శ్రీకాంత్ రెడ్డిని హెచ్చరించారు.
గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇంటి ముందు నుంచి టీడీపీ నేతల వాహనాలు వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు రాంప్రసాద్ రెడ్డి. టీడీపీ నేతల కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా నిన్న టీడీపీ కార్యకర్తల ఇళ్ల వద్దకు వెళ్లి దౌర్జన్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇకనైనా ఇలాంటి శిఖండి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే గతంలో చెప్పినట్లుగానే హైదరాబాద్ నుంచి రాయచోటికి రాకుండా అడ్డుకుంటామని, గువ్వలచెరువు ఘాట్ వద్దే నిలిపివేస్తామని హెచ్చరించారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి రాజకీయాల కోసం రాయచోటి ప్రాంతాన్ని బలిచేయవద్దని మంత్రి వ్యాఖ్యానించారు. నామినేషన్లు వేయకుండా ఉండి, ఏకగ్రీవాలు అయ్యాయని ఇప్పుడు గగ్గోలు పెడుతూ మళ్లీ ఎన్నికలు కావాలని కోరడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ విషయంలో ఇకపై వెనక్కి తగ్గేది లేదని, తన వ్యాఖ్యలను వార్నింగ్‌గా భావించినా మరోలా అనుకున్నా ఇదే తుది హెచ్చరిక అని స్పష్టం చేశారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..
Also Read
- Kadapa Controversy: రాజకీయ నేత కోసం వెంకన్న పోస్టరా? కడపలో వైరల్‌గా మారిన ఫొటో!
- Independent Candidate Victory: జనసేనకు ఝలక్.. 373 ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం..!
- Pulivendula Election Results: 43 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. పులివెందులలో ఎగిరిన టీడీపీ జెండా..
- Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
తాజావార్తలు
-
Minister Ramprasad Reddy: గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాస్ వార్నింగ్.. నేరుగా తేల్చుకుందాం..!
-
Bilkis Bano Case: బిల్కిస్ బానో గ్యాంగ్‌రే*ప్ కేసు.. 17 ఏళ్ల తర్వాత ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్!
-
AOT Trailer: పది మంది నవ్వితే ఏంటి, ఒక్కరు నమ్మితే చాలదా.. హృదయానికి హత్తుకునేలా ఏవోటీ ట్రైలర్!
-
Teja Sajja Engagement: ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన ప్రముఖులు..!
-
Cyclone Aquan Alert: అక్వాన్ తుఫాన్‌పై ఏపీ ప్రభుత్వం అలర్ట్.. యాక్షన్ ప్లాన్ రెడీ.. అధికారులకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!