Posani Gets Bail: పోసానికి బెయిల్ మంజూరు.. ట్విస్ట్ ఏంటంటే..?
- సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఊరట..
- బెయిల్ మంజూరు చేసిన కడప మొబైల్ కోర్టు..
- ఓబులవారిపల్లి పీఎస్ లో నమోదైన కేసులో బెయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Posani Gets Bail: సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట దక్కింది.. పోసానికి కడప మొబైల్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో పోసానిపై నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో పోసానిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో గత నెల 24వ తేదీన కేసు నమోదు అయిన విషయం విదితమే కాగా.. ఈ కేసులో గత నెల 28వ తేదీన ఓబులవారిపల్లె పోలీసులు పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేశారు. 29వ తేదీన రైల్వే కోడూరు కోర్టులో హాజరుపర్చగా.. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. అయితే, గత సోమవారం పోసానిని కస్టడీకి ఇవ్వాలంటూ ఓబులవారిపల్లి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్ క్రేజీ డీల్స్.. ఐఫోన్ పై వేలల్లో డిస్కౌంట్..
Also Read
మరోవైపు.. పోసాని న్యాయవాదులు కూడా ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్ లపై గత వారం రోజులలో రెండుసార్లు కడప మొబైల్ కోర్టు లో విచారణ జరిగింది.. సుదీర్ఘ విచారణ అనంతరం పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, నరసరావుపేట, ఆదోని కోర్టుల్లోనూ పోసాని బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే విచారణ ముగిసింది.. ఇప్పుడు కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసినా.. నరసరావుపేట, ఆదోని కోర్టుల్లోనూ బెయిల్ వస్తేనే పోసాని కృష్ణమురళి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే, ఒక్క కోర్టు బెయిల్ రద్దు చేసినా.. పోసాని మళ్లీ పై కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది..
తాజావార్తలు
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!