Kadapa: ప్రొద్దుటూరులో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఇంటిపై దాడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadapa: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు కలకలం రేపుతున్నాయి.. ఇక, కడప జిల్లా జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రొద్దుటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి ఇంటిపై అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడినారు.. పల్సర్ బైక్‌పై ముసుగులు ధరించి వచ్చిన దుండగులు ఆయన ఇంటి ప్రాంగణంలో ఉన్న కారు అద్దాలను పగలగొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పల్సర్ బైక్‌పై వచ్చి దాడి
అర్ధరాత్రి దాటిన తర్వాత పోరెడ్డి నరసింహారెడ్డి ఇంటి వద్దకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు, ఇంటి ప్రాంగణంలో ఉన్న కారును లక్ష్యంగా చేసుకుని అద్దాలను ధ్వంసం చేశారు.. దాడికి పాల్పడిన వ్యక్తులు ముసుగులు ధరించి పల్సర్ బైక్‌పై వచ్చినట్లు తెలుస్తోంది.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు, నిన్న వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నట్లు వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి చోటుచేసుకున్న ఈ పరిణామాలతో ప్రొద్దుటూరులో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
Also Read
- Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్‌కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
- YS Jagan: వైఎస్సార్ 77వ జయంతి.. ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్
ప్రచారంలో ఉన్న అభ్యర్థిని ఇంటికి తరలింపు
ప్రచారంలో ఉన్న చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డిని పోలీసులు హుటాహుటిన ఇంటికి తరలించి, హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఆయన ఇంటి ప్రాంగణంలో కారు అద్దాలు ధ్వంసం కావడం మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే, పోరెడ్డి నరసింహారెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దుండగులను గుర్తించేందుకు, దాడి వెనుక కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఎన్నికల వేళ జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిపై ఈ ఘటన ఆందోళనకు కారణమైంది.
తాజావార్తలు
-
Kadapa: ప్రొద్దుటూరులో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఇంటిపై దాడి!
-
Solar-Powered Cart: వీధి వ్యాపారుల కోసం సోలార్ బండి.. డిజిటల్ పేమెంట్స్‌తో ఐఐటీ ఖరగ్‌పూర్ కొత్త ఆవిష్కరణ!
-
Shafali Verma: రాత్రంతా నిద్రపోలేదు.. దాని గురించే ఆలోచించా.. షఫాలీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bollywood: రోహిత్, రణ్వీర్, టైగర్ ష్రాఫ్.. బాలీవుడ్లో మళ్లీ అండర్‌వరల్డ్ నీడలు.. దడ పుట్టిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్..
-
CJP 2.0: సీజేపీ నెక్స్ట్ మూవ్ ఏంటి..? అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!