IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలంలో పాకిస్థాన్ ఆటగాడు..? డిసెంబర్ 16న మినీ వేలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ఐపీఎల్ 2027 మినీ వేలంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. యూకే (బ్రిటన్) పౌరసత్వం పొందిన ఆయన, బ్రిటిష్ పౌరుడిగా లీగ్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా డిసెంబర్ 16న గోవాలో జరగనున్న ఐపీఎల్ 2027 మినీ వేలం వేళ, ఆయన ఆఫ్ఘనిస్థాన్ ప్రీమియర్ లీగ్ డ్రాఫ్ట్‌లో బ్రిటిష్ పౌరుడిగా పేరు నమోదు చేసుకోవడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. గతంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అజార్ మహమూద్ కూడా బ్రిటిష్ పౌరసత్వం పొందిన తర్వాతే ఐపీఎల్లో కింగ్స్ XI పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన దాఖలాలు ఉండటంతో అమీర్ విషయంలోనూ అదే జరుగుతుందని అందరూ భావించారు.
అయితే, ఈ ప్రచారానికి మహమ్మద్ అమీర్ వెంటనే తెరదించారు. ఐపీఎల్లో తాను పాల్గొనబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ ఖండించారు. తాను ఐపీఎల్ వేలంలోకి వస్తున్నాననే వార్తలు పూర్తిగా అబద్ధమని ఎక్స్ వేదికగా ఆయన స్పష్టతనిచ్చారు.
Also Read
- Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
- Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
- Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
- Tamil Nadu: మహిళా కలెక్టర్‌కు టీవీకే ఎమ్మెల్యే వేధింపులు.. పోలీసుల మౌనంపై హైకోర్టు ఆగ్రహం!
34 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం పేసర్ 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పారు. పాకిస్థాన్ తరఫున 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20 మ్యాచ్‌లు ఆడిన అమీర్, అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 259 వికెట్లు తీశారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్న ప్రైవేట్ టీ20 లీగ్‌లలో ఆడుతున్నారు.
2026 మే నెలలో అమీర్‌కు బ్రిటిష్ పౌరసత్వం లభించింది. దాంతో ఆయన ఇంగ్లాండ్ స్థానిక ఆటగాడిగా అక్కడి కౌంటీ, టీ20 టోర్నమెంట్లలో పాల్గొంటున్నారు. నాటింగ్‌హామ్‌షైర్ తరఫున టీ20 బ్లాస్ట్, అలాగే ట్రెండ్ రాకెట్స్ తరఫున ‘ది హండ్రెడ్’ టోర్నమెంట్లలో స్థానిక ప్లేయర్‌గా మ్యాచ్‌లు ఆడారు. యూకే పాస్‌పోర్ట్ రావడంతో విదేశీ లీగ్‌లలో బ్రిటిష్ పౌరుడిగానే నమోదు చేసుకుంటున్నారు. ప్రచారంలో ఉన్నట్లు ఆయన ఐపీఎల్‌లోకి రావడం లేదని స్పష్టం చేయడంతో ఈ వివాదానికి, ఊహాగానాలకు ముగింపు పడింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
YS Sharmila : బెంగళూరులో హైడ్రామా.. యలహంక ఇంటికి వెళ్లేందుకు షర్మిల, విజయమ్మ ప్రయత్నం
-
January 12 Vidudala : ఆ ఫార్మాట్ మారింది.. కానీ?
-
Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
ట్రెండింగ్
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!