Homemade Malai: పాల మీగడ మందంగా రావట్లేదా? ఈ 4 సింపుల్ టిప్స్ పాటిస్తే గిన్నె నిండా మీగడ పక్కా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How to Get Thick Cream on Milk: చాలా మందికి పాల మీద గడ్డకట్టే మందమైన మీగడ తినడమంటే చాలా ఇష్టం. కొంతమంది దీన్ని ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారు చేయడానికి వాడితే, మరికొందరు వేడి వేడి అన్నంలో లేదా చపాతీ, రొట్టెలతో నంజుకుని తింటుంటారు. కానీ ఎంత కాగబెట్టినా కొన్నిసార్లు పాల మీద మీగడ మాత్రం సరిగ్గా రాదు. పాలలో నీళ్లు కలిపారంటూ వెంటనే పాల నాణ్యతను తప్పుపడుతుంటాం. అయితే, ప్రతిసారీ మీగడ పల్చగా రావడానికి కేవలం పాలు కల్తీ కావడమే కారణం కాదనే విషయం మీకు తెలుసా? ఇంట్లో కాచే పాలలో చిక్కటి మీగడ రావాలంటే అది కేవలం పాల క్వాలిటీ మీద మాత్రమే కాకుండా, వాటిని కాచే విధానం, అందులో ఉండే ఫ్యాట్ శాతం, అలాగే కాగబెట్టాక చల్లార్చే పద్ధతి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పాలు ఏవైనా సరే చక్కగా మీగడ తేలుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మొదటగా పాలు కాచేటప్పుడు చేసే చిన్న పొరపాట్లను సరిదిద్దుకోవాలి. పాలు పొంగిపోకుండా ఉండేందుకు ముందుగా ఒక శుభ్రమైన, లోతుగా ఉండే గిన్నెను తీసుకోవాలి. ఇప్పుడు పాలను మీడియం మంట మీద మరిగించాలి. అడుగు అంటకుండా మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాలలో బాగా పొంగు రాగానే మంటను పూర్తిగా తగ్గించాలి. ఆ తర్వాత పాలను కాసేపు చిన్న మంట మీదనే మరిగించనివ్వాలి. ఎప్పుడూ హై ఫ్లేమ్ మీదే ఉంచి మరిగించాల్సిన అవసరం లేదు. అలాగే, పాల మీద ఎంత మీగడ రావాలనేది అందులో ఉండే ఫ్యాట్ (కొవ్వు) శాతంపై కూడా ఆధారపడి ఉంటుంది. పాలలో ఫ్యాట్ తక్కువగా ఉంటే వచ్చే మీగడ కూడా తక్కువే ఉంటుంది. అదే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మంచి మందమైన మీగడ వస్తుంది. అందుకే చిక్కటి మీగడ కావాలనుకునే వారు పాలు కొనేటప్పుడే ఫ్యాట్ శాతం ఎక్కువున్నవి ఎంచుకోవడం మంచిది. కేవలం ఎక్కువసేపు మరిగిస్తేనే మీగడ వస్తుందని అనుకోవడం పొరపాటే.
Also Read
- Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
- Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
- Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
- Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే 'రాగి బిస్కెట్లు'.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
ఇక, పాలు కాగాక వాటిని చల్లార్చే విధానం కూడా చాలా ముఖ్యం. చాలా మంది పాలు కాగాక పదే పదే గరిటెతో కలుపుతూనే ఉంటారు. మీగడ కట్టే సమయంలో పాలను కదిలిస్తే పైన తయారవుతున్న పొర చెదిరిపోతుంది. అందుకే పాలు మరిగిన తర్వాత ఆ గిన్నెను ఎవరూ కదల్చని ప్రదేశంలో ఉంచాలి. దుమ్ము దూళి పడకుండా శుభ్రమైన మూతతో కప్పాలి. పాలు ఆంతట అవే నెమ్మదిగా చల్లారాలి. ఈ సమయంలో వాటిని పదే పదే కదపకపోతేనే మందమైన మీగడ గడ్డకడుతుంది. పాలు చల్లారిన తర్వాత వాటిని ఎక్కువసేపు బయట గది ఉష్ణోగ్రత వద్దే వదిలేయకూడదు. ముఖ్యంగా వేసవిలో పాలు త్వరగా పాడైపోతాయి. కాబట్టి పాలను సరిగ్గా చల్లార్చిన తర్వాత సరైన సమయంలో ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. మీగడ మందంగా రావాలంటే పాలు కాగాక వాటిని పదే పదే కదపడం లేదా గరిటె పెట్టి తిప్పడం చేయకూడదు. అలాగే ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు కూడా శుభ్రమైన గిన్నెలో పోసి భద్రపరచుకోవాలి. చివరగా పాలలో మీగడ బాగా రావాలంటే ఈ 5 ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి. ఎప్పుడూ ఫుల్ క్రీమ్ పాలను మాత్రమే ఎంచుకోండి, ఇందులో ఫ్యాట్ ఎక్కువగా ఉండి మీగడ నిండుగా వస్తుంది. పాలు పొంగకుండా ఉండేందుకు శుభ్రమైన, లోతైన గిన్నెను వాడండి. పాలు పొంగాక మంట తగ్గించి కాసేపు సిమ్‌లో ఉంచండి. పాలు చల్లారేటప్పుడు వాటిని పదే పదే కదపకండి. చివరగా పాలు బయట పాడైపోకుండా త్వరగా ఫ్రిజ్‌లో భద్రపరచుకోవడం మర్చిపోవద్దు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ లీడ్!
-
Homemade Malai: పాల మీగడ మందంగా రావట్లేదా? ఈ 4 సింపుల్ టిప్స్ పాటిస్తే గిన్నె నిండా మీగడ పక్కా!
-
India First Bullet Train: గంటకు 280 కి.మీ వేగం.. వై-ఫై నుంచి లగ్జరీ సీట్ల వరకు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ విశేషాలు
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!
-
Hyderabad: పాతబస్తీలో దారుణ హత్య.. యువకుడిని కత్తులతో దాడి చేసి చంపిన దుండగులు
-
YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై కేసు నమోదు..
ట్రెండింగ్
-
ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి