నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడపకు చేరుకొని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీవోను పరామర్శించనున్నారు. అనంతరం గాలివీడుకు రోడ్డు మార్గాన వెళ్లనున్నారు. గాలివీడులో ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన పరిశీలించనున్నారు.
అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడి ఘటన కలకలం రేపుతోంది.. అయితే, ఈ ఘటనపై కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. విధి నిర్వహణలో ఉన్న జవహర్…