YS Jagan Pulivendula Tour: నేడు పులివెందులకు వైఎస్ జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Pulivendula Tour: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పులివెందలకు వెళ్లనున్నారు. ఆయన మరో రెండు రోజుల పాటు పులివెందులలోనే ఉండనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ప్రజాదర్భార్ నిర్వహణతో పాటు పార్టీ నేత కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమాలు ఉన్నాయి. వైఎస్ జగన్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకోనున్నారు. అక్కడి భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్ నిర్వహించి స్థానిక ప్రజల సమస్యలు, వినతులు స్వీకరించనున్నారు. అనంతరం రాత్రికి అక్కడి నివాసంలో బస చేయనున్నారు.
Read Also: MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..
Also Read
ఇక, రేపు ఉదయం 9 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి లింగాల మండలంలోని ఇప్పట్ల గ్రామానికి వెళ్లనున్నారు. ఇటీవల కన్నుమూసిన స్థానిక వైఎస్సార్సీపీ నేత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతి తెలియజేయనున్నారు. అనంతరం తిరిగి పులివెందుల క్యాంప్ కార్యాలయానికి చేరుకుని మరోసారి ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఆ తర్వాత ఈ నెల 23వ తేదీ ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి వైఎస్ జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో స్థానికంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
తాజావార్తలు
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!