Bobby : ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్లకు పాన్ ఇండియా మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో తెలుగు డైరెక్టర్లు దుమ్ము లేపుతున్నారు. మన డైరెక్టర్లు తీసిన సినిమాలకు బాలీవుడ్ ఫిదా అయిపోతోంది. రాజమౌళి, సుకుమార్ లాంటి వాళ్లే కాకుండా ఇతర డైరెక్టర్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే సందీప్ యానిమల్ తీసేశాడు. గోపీచంద్ మలినేని సన్నీడియోల్ తో జాట్ మూవీ తీస్తున్నాడు. ఇప్పుడు ట్యాలెంటెడ్ డైరెక్టర్ బాబీ కూడా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో సినిమా చేయబోతున్నాడంట. ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Read Also : Odela2 : రిలీజ్ కు ముందే లాభాల్లోకి ఓదెల-2.. భారీగా బిజినెస్..
డాకు మహారాజ్, వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుస హిట్లు కొట్టాడు బాబీ. రీసెంట్ గానే ముంబై వెళ్లి హృతిక్ కు స్టోరీ లైన్ చెప్పాడంట. దానికి హృతిక్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. పూర్తి స్క్రిప్టు అయిన తర్వాత మరోసారి హృతిక్ ను కలవబోతున్నాడు. రెండోసారి కూడా హృతిక్ ఓకే చెబితే వీరిద్దరి కాంబోలో ఈ ఏడాదిలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రస్తుతానికి ఈ మూవీ చర్చల దశలోనే ఉంది. హృతిక్ వార్-2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ మూవీ తర్వాత బాబీతో సినిమా ఉండే ఛాన్స్ ఉంది.