ఈ రోజు టీడీపీ కండువా కప్పుకోనున్న వారిలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వారి అనుచరులు కూడా ఉన్నారు.. మరోవైపు, ఉదయం 11 గంటలకు ముఖ్య నేతలతో సమావేశంకానున్నారు చంద్రబాబు నాయుడు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారో తమకు తెలుసునని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. అందుకే వారిని పార్టీ నుంచి బహిష్కరించామన్నారు.
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్‌ను విమర్శిస్తూ ఆమె మాట్లాడటం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. అంబేద్కర్ వల్ల మనకు ఎలాంటి హక్కులు రాలేదన్నారు. అంబేద్కర్ వల్ల సాధ్యం కానివి బాబూ జగ్జీవన్ రాం వల్ల సాధ్యమయ్యాయని ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యానించారు. Read Also: అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట ఈరోజు మనకు రాజ్యాంగ హక్కులు…
ఏపీలో సంచలన సృష్టించిన 3 రాజధానుల అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా త్వరలోనే కొన్ని మార్పులతో మరోసారి బిల్లును తీసుకువస్తామని వ్యాఖ్యానించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇది ఇంటర్వెల్ మాత్రమే ఇంకా 3 రాజధానుల సినిమా అయిపోలేదు అన్నారు. అయితే తాజాగా తాటికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా 3 రాజధానుల అంశంపై స్పందించారు. సీఎం జగన్ తగ్గేదేలేదని..…
హైదరాబాద్‌లో ఘనంగా బోనాలు జరుగుతున్నాయి.. ఓల్డ్ సిటీ లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారు గుంటూరు జిల్లా తాటికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి… వైపీసీ ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికింది లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ… ఇక, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వమించిన ఎమ్మెల్యే శ్రీదేవి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో తాను డాక్టర్‌గా ప్రాక్టీస్ చేశానని గుర్తుచేసుకున్నారు.. నేను వైసీపీ ఎమ్మెల్యేను,…