ఏపీలో ఈనెల 26 నుంచి 29 వరకు వైసీపీ మంత్రులు బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు గురువారం నాడు మంత్రులు బొత్స, ధర్మాన, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగ నాగార్జున బస్సు యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. సామాజిక న్యాయ భేరీ పేరుతో బస్సు యాత్రను చేపడుతున్నామని వెల్లడించారు. ఈ నెల 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు వరుసగా నాలుగు బహిరంగ సభలు నిర్వహించాలని…
మంత్రిగా మారాక ధర్మాన ప్రసాదరావు తన శాఖపై పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోసారి రెవిన్యూశాఖ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన. నిజాయితి గల పరిపాలన ప్రజలకు ఇవ్వాలన్నారు. త్వరితగతిన సేవలు అందించాలి. దీనికోసం వ్యక్తులు లేదా వ్యవస్థలను సంస్కరించాలన్నారు. ప్రజలనుండి రెవిన్యూ శాఖ పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, రెవిన్యూ శాఖని అన్నానంటే .నేను కూడా…
వైసీపీ కార్యకర్తపై మంత్రి ధర్మాన చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ధర్మాన ప్రసాదరావు శుక్రవారం నాడు శ్రీకాకుళంలో పర్యటించారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్లీ మంత్రి పదవి చేపట్టిన ధర్మాన ప్రసాదరావును కలిసేందుకు భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మానతో కరచాలనం చేసేందుకు వైసీపీ కార్యకర్తలు పోటీ పడ్డారు. ఈ సమయంలో ఓ వైసీపీ కార్యకర్త మంత్రి ధర్మాన…