Yanamala: అప్పులపై బహిరంగ చర్చకు సీఎం జగన్ సిద్ధమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yanamala: వైసీపీ ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. అప్పులపై అరగంటకో అబద్ధం.. గంటకో అప్పు, రోజుకో నిబంధన.. ఉల్లంఘన అనే విధంగా వైసీపీ పాలన సాగుతోందని యనమల ఆరోపించారు. అప్పులపై సీఎం జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కాగ్ అధికారుల సమక్షంలో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు యనమల తెలిపారు. రాజ్యంగబద్ధ సంస్థలైన కాగ్ వంటి వాటికి కూడా వాస్తవాలు ఇవ్వకుండా దాచిపెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం లెక్కలు, నివేదికలు ఇవ్వడం లేదని కాగ్ చెప్పిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.
Read Also: Maa Bava Manobhavalu: బాలయ్య పాటకి ఇరగదీసే స్టెప్పులు వేసిన చరణ్, బన్నీ
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
గతంలో కన్నా తక్కువ అప్పులు చేస్తున్నామంటూ సీఎం జగన్ మరోసారి అబద్ధ ప్రచారానికి తెర లేపారని యనమల విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో రూ.6 లక్షల 38 వేల కోట్లు అప్పు చేసిందని.. అప్పులు 3.98 లక్షల కోట్లు, హఫ్ బడ్డెట్ బారోయింగ్ 93 వేల కోట్లు, కార్పొరేషన్ గ్యారెంటీలు 1.47 లక్షల కోట్లుగా ఉందన్నారు. వీటికి అదనంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వేల కోట్లల్లో ఉంటాయన్నారు. జగన్ ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యేనాటికి అప్పు రూ.11 లక్షల కోట్లకు పైగా చేరుతుందని యనమల జోస్యం చెప్పారు. కార్పొరేషన్లు, వివిధ సంస్థల ద్వారా తీసుకొస్తున్న అప్పుల లెక్కలను చూపకుండా దాచిపెడుతున్నారని ఆరోపించారు. కార్పొరేషన్ల బ్యాలెన్స్ షీట్లను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని.. వైసీపీ ప్రభుత్వ హయాంలో లంచాలు తగ్గాయనడం హాస్యాస్పదంగా ఉందని చురకలు అంటించారు.
ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఇకమీదట అవినీతి, అక్రమాలకు పాల్పడొద్దని ముఖ్యమంత్రి చెప్పిన మాట వాస్తవం కాదా అని యనమల సూటిగా ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం కోసం వినియోగించాల్సిన ప్రకృతి సహజ వనరులను వైసీపీ నేతలు దోపిడీ కోసం వినియోగించుకోవడం లేదా అని నిలదీశారు. మద్యం, ఇసుక వ్యవహారాల్లో నగదు లావాదేవీలను మాత్రమే ఎందుకు నిర్వహిస్తున్నారని సూటి ప్రశ్న వేశారు. తాడేపల్లి ప్యాలెస్ ముడుపుల కోసం రాష్ట్రంలో డిజిటల్ లావాదేవీలు లేకుండా చేసిన విషయం వాస్తవం కాదా అని అన్నారు. 175 సీట్లు వస్తాయనేది అన్నీ పగటి కలలే అని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోవడం ఖాయమన్నారు. సాగునీటి ప్రాజెక్టులు అన్నిపూర్తిచేసి సస్యశ్యామలం చేస్తామని జల కధలు చెప్పిన జగన్ మూడున్నరేళ్లుగా ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశారని నిలదీశారు. వ్యవసాయం.. గాలిలో దీపమై పనుల్లేక ప్రజలు వలస పోతున్నారని.. జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చేసిన ద్రోహం, దగా, మోసం ఏ రాష్ట్రంలో ఎప్పుడూ ఎక్కడా ఏ పాలకుడూ చేసి ఉండరని యనమల అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!