* నేడు తూర్పు గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో జరగనున్న రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు.. అనంతరం రాజముద్రతో కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు.. సీఎం పర్యటన నిమిత్తం రాయవరంలో భారీగా ఏర్పాట్లు.. మధ్యాహ్నం రెండు గంటలకు టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు
* నేటి నుంచి కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. పిఠాపురంలో రూ. 26 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు.. రూ. 186 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనున్న డిప్యూటీ సీఎం..
* నేడు విశాఖ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం.. హాజరుకానున్న ఇంచార్జ్ మంత్రి బాల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యేలు..
* నేటి నుంచి విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్.. రెండు రోజుల పాటు ఎంజీఎం పార్క్ వేదికగా వేడుకలు.. హాజరుకానున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి సురేశ్ గోపి..
* నేడు తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం.. దివాన్ చెరువు డీబీ రాజు కళ్యాణ మండపంలో జరగనున్న మీటింగ్.. సమావేశానికి హాజరుకానున్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు..
* నేడు శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలపై జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం.. మూడు జిల్లాల అధికారులు, ఆలయ ఛైర్మన్, ఈవో, ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులు.. నంద్యాల, మార్కాపురం, నాగర్ కర్నూలు జిల్లాల ఎస్పీలు.. ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..
* నేడు ఖమ్మం జిల్లా మధిరలో పర్యటించి, అధికారులతో రివ్యూ చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
* నేడు అశ్వారావుపేటలో మంత్రులు ఉత్తమ కుమార్ , తుమ్మల పర్యటన.. ప్రకృతి వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి శ్రీకారం..
* నేడు భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
* నేడు సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన.. గర్ల్స్ హై స్కూల్లో సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించనున్న మంత్రి పొన్నం..
* నేడు సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న హరీష్ రావు..
* నేడు భైంసాకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ ల సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న ఈటల..
* నేటి నుంచి తెలంగాణలో రాజాసాబ్ సినిమా టికెట్ ధరలు పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ఈ నెల 11 వరకు సింగిల్ స్ర్కీన్ లో రూ. 105, మల్టీప్లెక్సుల్లో రూ. 132 పెంచుకునే అవకాశం.. సింగిల్ స్ర్కీన్ లో రూ. 62, మల్టీప్లెక్సుల్లో రూ. 89 పెంచుకునే ఛాన్స్.. లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్ కు ఇవ్వాలని సూచించిన ప్రభుత్వం..
* నేటి నుంచి ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు.. తిరుమలలో జారీ చేసే ఆఫ్ లైన్ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ.. ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో దర్శన టికెట్లు విడుదల.. రోజుకి 800 చొప్పున టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. సాయంత్రం 4గంటలకి భక్తుల దర్శనానికి అనుమతించనున్న టీటీడీ..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి నారాయణగిరి ఉద్యానవనం వరకు వేచి ఉన్న భక్తులు.. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 16 గంటల సమయం..
* నేడు తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వర్ష సూచన.. బలపడిన వాయుగుండం, దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలు..
* నేటి నుంచి WPL ప్రారంభం.. తొలి మ్యాచ్ లో ముంబై వర్సెస్ బెంగళూరు మధ్య పోటీ.. రాత్రి 7: 30 గంటలకి ముంబై వేదికగా మ్యాచ్..