* నేడు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన.. కేశనపల్లిలో కొబ్బరి చెట్లను పరిశీలించి రైతులతో మాట్లాడనున్న పవన్.. సముద్ర జలాల కారణంగా దెబ్బ తిన్న లక్షలాది కొబ్బరి చెట్లు.. శివకోటిలో పల్లె పండగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్..
* నేడు రెండో రోజు కడప జిల్లాలో జగన్ పర్యటన.. బ్రాహ్మణపల్లెలో అరటి తోటను పరిశీలించి, రైతులతో మాట్లాడనున్న జగన్.. అనంతరం పులివెందుల చేరుకొని లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్.. మధ్యాహ్నం లింగాల వేల్పులలో లింగాల రామలింగారెడ్డి నివాసానికి వెళ్లనున్న జగన్..
* నేటి నుంచి నాలుగు రోజుల పాటు జోగి రమేశ్ ను ప్రశ్నించనున్న ఎక్సైజ్ పోలీసులు.. నెల్లూరు సబ్ జైలు నుంచి విజయవాడ తీసుకురానున్న ఎక్సైజ్ పోలీసులు.. జోగి రమేశ్ తో పాటు అతని సోదరుడు జోగి రామును విచారించనున్న పోలీసులు..
* నేడు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లతో లోకేష్ భేటీ.. పార్టీ కార్యాలయాల్లో గ్రీవెన్స్ పై లోకేష్ దృష్టి..
* నేడు అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ.. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీ..
* నేడు ఉదయం 9.45 గంటలకు శంషాబాద్ లోని GMR ఏరోపార్క్ వద్ద సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా LEAP ఇంజిన్ MRO కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి..
సాయంత్రం 4.30 గంటలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 పై సమీక్ష సమావేశం
* నేడు హన్మకొండ, జనగామ జిల్లాల్లో కేటీఆర్ పర్యటన.. ఉదయం 11: 30కి హన్మకొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం.. మధ్యాహ్నం 3గంటలకి జనగామ జిల్లా ముఖ్య కార్యకర్తలతో భేటీ..
* నేడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం.. ఉదయం 11గంటలకి నవీన్ తో ప్రమాణం చేయించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..
* నేడు ఐ-బొమ్మ రవి కస్టడీపై నాంపల్లి కోర్టు తీర్పు.. ఏడు రోజుల కస్టడీని కోరిన సీసీఎస్ పోలీసులు..
* నేడు రాజ్యాంగ దినోత్సవం.. సంవిదాన్ సదన్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. పాల్గొనున్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు..
* నేడు సుప్రీంకోర్టులో ఎస్ఐఆర్ కేసు విచారణ..
* నేడు నుంచి ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ.. గాయం తర్వాత పునరాగమనం చేయనున్న హర్ధిక్ పాండ్యా..