* నేడు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన.. జాతీయ సాంస్కృతిక విద్య విశ్వ విద్యాలయంలో.. 3 రోజులు జరిగే భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు.. తర్వాత జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..
* నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన..
* నేడు ఆదిలాబాద్ జిల్లాలో ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన.. మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పర్యటన..
* నేడు ఆదిలాబాద్ జిల్లాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. రిమ్స్ ఆసుపత్రి క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభించనున్న కిషన్ రెడ్డి.. పట్టణంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొననున్న కేంద్రమంత్రి..
* నేటితో ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగియనున్న ప్రభాకర్ రావు విచారణ.. వైద్య పరీక్షల తర్వాత ఇంటికి వెళ్లనున్న ప్రభాకర్ రావు..
* నేడు తిరుమలకు భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం..
* నేడు శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సమావేశం.. ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడి అధ్యక్షతన జరగనున్న బోర్డ్ మీటింగ్.. పాల్గొననున్న సభ్యులు, ఆలయ ఈవో శ్రీనివాసరావు, అధికారులు..
* నేడు ఆహోబిళం శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి పారువేట ఉత్సవ శోభాయాత్ర.. లక్ష్మీగణపతి ఆలయం నుంచి గాంధీ చౌక్, శ్రీనివాస నగర్ సెంటర్ నుంచి టౌన్ హాల్ వరకు శోభాయాత్ర..
* నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన చీఫ్ సెక్రెటరీల సమావేశం.. 3 రోజుల పాటు జరగనున్న సదస్సు.. వికసిత్ భారత్-2047 లక్ష్యాలపై దృష్టి.. కేంద్ర, రాష్ట్రాల సహకారం బలోపేతం ప్రధాన అజెండాగా సమావేశం.. సీఎస్ ల సదస్సులో విద్య, ఆరోగ్యం, ఆర్థిక హాబ్స్, ఫ్రాంటియర్ టెక్నాలజీలు, బెస్ట్ ప్రాక్టీస్ లపై జరగనున్న చర్చలు..
* నేడు శ్రీలంకతో భారత్ మూడో టీ20.. తిరువనంతపురం లో రాత్రి 7 గంటలకు మ్యాచ్..