ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలలో రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కేవలం లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో వాలంటరీ వ్యవస్థ సంబంధించి ప్రస్తుతం ఎన్నో రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ‘వాలంటీర్’ అంటూ ఓ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా విశేషాలు చూస్తే..…
ఏలూరులో వాలంటీర్ వ్యవహారం సంచలనంగా మారింది.. మహిళను లోబర్చుకొని వాలంటీర్ గర్భవతిని చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ గ్రామానికి చెందిన ఓ మహిళను లోబర్చుకున్న గర్భవతిని చేశాడు వాలంటీర్ మండిగ సత్య గణేష్.. అయితే, విషయం బయటకొస్తుందని నెల క్రితమే ఆ వాలంటీర్‌ను విధుల నుంచి తొలగించారు.
సమాజంలో అడుగడుగునా మోసాలు జరుగుతున్నాయి. భర్త బతికుండగానే మరణించినట్లు వార్డు సచివాలయ సిబ్బంది, రెవిన్యూ అధికారులతో కలిసి ఓ మహిళా వాలంటీర్ మోసానికి తెగబడింది. ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులో నుండి తన భర్త పేరున తొలగించిన సంఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన బళ్లారి సుభాహాన్ బాషా గత రెండు ఏళ్ల కిత్రం రాయచోటి పట్టణం కొత్తపల్లెకు చెందిన ఓ మహిళను…
తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో ఈనెల 2న కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. లోదొడ్డి గ్రామ వాలంటీర్ వంతల రాంబాబు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను వారు వెల్లడించారు. మృతుల్లో ఒకరి భార్యతో రాంబాబు సన్నిహితంగా ఉండేవాడని.. గత నెలలో అతడు సన్నిహితంగా ఉన్న మహిళ మరిదితో గొడవ జరిగిన కారణంగా గ్రామ పెద్దలు…
ప్రేమించానని చెప్పి నీలి చిత్రాలను తీశాడో ప్రబుద్ధుడు. ఆమె నీలి చిత్రాలు తీసి గ్రామస్తులకు బంధువులకు పంపడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో పోకిరీల ఆగడాలు పెరిగిపోయాయి. వారి వికృత చేష్టలకు మహిళలు,యువతులు బలవుతున్నారు. వీరఘట్టం మండలం నడుకురు సంఘటన మరువక ముందే రేగిడి మండలం కొత్త చెలికానివలస గ్రామంలో మరొక సంఘటన చోటుచేసుకుంది. దళిత యువతిపై దుర్మార్గానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ప్రేమించానని నమ్మించి నీలిచిత్రాలను చిత్రీకరించాడు. మద్యం మత్తులో నీలి చిత్రాలను కుటుంబీకులకు…
తిరుపతిలోని శ్రీకాళహస్తిలో వాలంటీర్ చందన ఆత్మహత్యకు పాల్పడింది.. రైలు నుంచి దూకి రెండేళ్ల కుమారుడితో పాటు ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి నుంచి కనిపించకుండా పోయిన ఆమె రైలు పట్టాలపై విగతజీవిగా మారింది. తిరుపతి నుంచి నెల్లూరు మార్గంలో రైలు కింద పడి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీకాళహస్తి రూరల్ మండలం అక్కుర్తి గ్రామం వద్ద రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈఘటనకు సంబందించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.…