Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: ఇటీవల తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లా్ల్లో భారీ నష్టమే జరిగింది.. అయితే పంట నష్టం, రైతులకు నష్ట పరిహారంతో పాటు.. ఛలో విజయవాడ కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను గత ప్రభుత్వం దేశంలోనే ప్రత్యేకంగా తీసుకొచ్చిందని అన్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు చదివిన వారు కూడా ఈ ఉద్యోగాల్లో చేరారని, ఎలాంటి సందేహాలకు తావులేకుండా నియామకాలు చేపట్టామని తెలిపారు. ఇలాంటి సిబ్బందికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వేలాది మంది సచివాలయ ఉద్యోగులు ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి వెళ్లగా, వారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని బొత్స తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకునే హక్కు ఉద్యోగులకు ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలను తెలుసుకునే ఓపిక ప్రభుత్వానికి లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. పోలీసులను ఉపయోగించి ఉద్యోగుల ఆందోళనను అణిచివేయాలని చూడటం సరికాదని అన్నారు.
ఉత్తరాంధ్రలో తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయని బొత్స పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల తరఫున ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లించిందని, ఆ విధంగా రైతులను ఆదుకున్నామని తెలిపారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని విమర్శించారు. తిత్లీ తుఫాన్ సమయంలో జరిగిన నష్టాలకు పరిహారం ఇచ్చారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా రైతులు భారీగా నష్టపోయారని, కేవలం రూ.వెయ్యి, రూ.10 వేలతో సమస్య పరిష్కారం కాదని అన్నారు. పంట నష్టంతో పాటు రైతులు జీవనాధారాన్ని కూడా కోల్పోయారని బొత్స తెలిపారు. నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి తగిన పరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా రైతులకు అవసరమైన సహాయం అందించాలని కోరారు. ఇటీవల భారీ వర్షాలు, తుఫాన్ కారణంగా పంట నష్టం జరిగిందని, రైతులకు తగిన పరిహారం అందించాలని బొత్స ఇప్పటికే డిమాండ్ చేసినట్లు ఆయన పార్టీ కూడా పేర్కొంది.
Also Read
- Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
రాష్ట్రంలో పాలన పోలీస్ స్టేషన్లకే పరిమితమైందని బొత్స విమర్శించారు. అన్నీ పోలీస్ స్టేషన్లలోనే సెటిల్మెంట్లు జరుగుతున్నాయని, చివరకు గ్రామ రాజకీయాల్లో ఎవరు పోటీ చేయాలి, ఎవరు పోటీ చేయకూడదనే అంశాల్లో కూడా పోలీసుల జోక్యం ఉంటోందని ఆరోపించారు. పోటీ చేయాలనుకునే వారిని భయపెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. డీజీపీ ఏం చేస్తున్నారని బొత్స ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. ఎప్పటికీ ఒకే వ్యక్తి అధికారంలో ఉండరని, అధికారంలో మార్పులు సహజమని వ్యాఖ్యానించారు. పోలీసులు బ్రిటిష్ పాలనను తలపించేలా వ్యవహరించవద్దని, ప్రజా ఆగ్రహానికి గురికావద్దని కోరారు. ఉద్యోగుల ఆందోళనలో అసాంఘిక శక్తులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో బొత్స స్పందించారు. పోలీసులు ఇప్పటికే వీడియోలు తీశారని, నిజంగా అలాంటి వ్యక్తులు ఉంటే వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. అసాంఘిక శక్తుల పేరుతో మొత్తం ఉద్యోగుల ఆందోళనను తప్పుబట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు బొత్స సత్యనారాయణ..
తాజావార్తలు
-
Ultra-Processed Foods: మీరు తినే ఈ ఫుడ్‌తో బ్రెయిన్ డ్యామేజ్!
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు పండగే, ఊహించని డబ్బు!
-
Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
-
IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
-
Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులు ఢీ..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!