Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Impact: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వాయుగుడం దూసుకొస్తుంది.. దీంతో, అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రంగా మారడంతో ఉత్తరాంధ్రలో అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర వైపు వస్తోంది. తీరానికి సమీపిస్తున్న కొద్దీ గాలుల తీవ్రత పెరుగుతోంది. సెప్టెంబర్ 23 రాత్రి లేదా 24వ తేదీ తెల్లవారుజామున విశాఖపట్నం–గోపాల్పూర్ మధ్య ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాన్ని తీవ్ర వాయుగుండంగా దాటే అవకాశం ఉందని IMD తాజా అంచనాలు చెబుతున్నాయి.
పలు రైళ్లు రద్దు
వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. విశాఖలో సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు భారీ వర్షాలు, బలమైన ఉపరితల గాలులు నమోదయ్యే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తమైంది. విశాఖ–కొత్తవలస–కిరండోల్ మార్గంలో నడిచే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీసులను రేపు, ఎల్లుండి నిలిపివేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. వాయుగుండం కారణంగా రైల్వే సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు రైల్వే శాఖ తాజా సమాచారం తెలుసుకున్న తర్వాత ప్రయాణాలు చేసుకోవాలని సూచించారు.
Also Read
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ఘాట్ రోడ్లలో ఆంక్షలు..
మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోనూ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. వాయుగుండం ప్రభావంతో ఘాట్‌రోడ్లలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో రాత్రి వేళ భారీ వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. కొండ వాలు ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
స్కూళ్లకు సెలవు..
విజయనగరం జిల్లాలోనూ వర్షాలు నిరంతరాయంగా కురుస్తుండటంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. సెప్టెంబర్ 23న కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. మరోవైపు.. సముద్ర పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. ట్రాలర్లు, బోట్లు, చిన్న నౌకల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రోడ్డు రవాణా, అవసరాన్ని బట్టి హెలికాప్టర్ సేవలను కూడా నియంత్రించే పరిస్థితి ఏర్పడవచ్చని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని IMD పేర్కొంది.
బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్లు, హోర్డింగులు, పాత భవనాల వద్ద ఉండకూడదని అధికారులు సూచించారు. వాగులు, వంకలు, పొంగిపొర్లుతున్న కాజ్‌వేల వద్ద రాకపోకలు చేయవద్దని హెచ్చరించారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొత్తంగా రానున్న 24 నుంచి 48 గంటలు ఉత్తరాంధ్రకు కీలకంగా మారనున్నాయి. ప్రజలు వాతావరణ శాఖ, జిల్లా యంత్రాంగం జారీ చేసే అధికారిక హెచ్చరికలను పాటించాలని అధికారులు కోరుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!