Love Tragedy: మరో యువతితో పెళ్లి.. ప్రియురాల్ని మర్చిపోలేక యువకుడు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Boy Killed Himself After Marriage For Lover: విశాఖపట్నంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పెళ్లైన తర్వాత తాను ప్రేమించిన యువతిని మర్చిపోలేక.. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రేమికుడ్ని కాపాడుకోవడానికి ప్రియురాలు సాయశక్తులా ప్రయత్నించింది కానీ, ఫలితం లేకుండా పోయింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం ఉక్కునగరానికి చెందిన రుంజల కిరణ్ బాబు (33) ఓ యువతిని ప్రేమించాడు. ప్రియురాలిది అచ్యుతాపురం. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా డీప్‌గా వీళ్లు ప్రేమించుకున్నారు. అయితే.. కిరణ్ తల్లిదండ్రులకు తమ కుమారుడి ప్రేమ వ్యవహారం గురించి తెలియదు. దీంతో.. అతనికి మరో యువతితో వివాహం నిశ్చయించారు. ధైర్యం చాలక.. తన ప్రేమ వ్యవహారాన్ని పేరెంట్స్‌కి కిరణ్ చెప్పలేకపోయాడు. ఏం చేయలేక వాళ్లు చూపించిన యువతితోనే జనవరి 26న పెళ్లి చేసుకున్నాడు.
Turkey Earthquake : టర్కీ భూకంప నష్టం 342కోట్ల డాలర్లు.. మన కరెన్సీలో ఎంతో తెలుసా?
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
అయితే.. పెళ్లి అయ్యాక తాను ప్రేమించిన యువతిని కిరణ్ మర్చిపోలేకపోయాడు. ప్రతిరోజూ లోలోపలే మదనపడుతూ వచ్చాడు. చివరికి ఆ బాధను భరించలేక.. చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. పురుగుల మందు తాగేశాడు. అనంతరం తన ప్రియురాలికి ఫోన్ చేసి.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, పురుగుల మందు తాగేశానని పేర్కొన్నాడు. అది విన్న వెంటనే ప్రియురాలు హటాముటిన ప్రియుడి ఇంటికి చేరుకుంది. అప్పటికే కిరణ్ శరీరంపై ఆ పురుగల మందు తీవ్ర ప్రభావం చూపింది. అతడు కొన ఊపిరితో ఉన్న విషయం గ్రహించి, ప్రియురాలు ఆసుపత్రికి తరలించింది. అయితే.. మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. కిరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కిరణ్ మృతితో ప్రియురాలు, భార్య, కుటుంబ సభ్యులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Revanth Reddy: భూపాలపల్లిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డిపై టమోటా, గుడ్లతో దాడి
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!