చిన్న విషయాలకు విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు నేటి తరం పిల్లలు. చదువుకునే విద్యార్థుల నుంచి కాటికి కాలు చాచిన వృద్ధుల వరకూ చాలా మంది తమ సమస్యలకు బలవన్మరణమే పరిష్కారమని భావిస్తూ ప్రాణాలు బలితీసుకుంటున్నారు.
నవమాసాలు మోసి కనిపెంచితే వృద్ధాప్యంలో తోడుగా ఉంటారనుకున్న బిడ్డలు క్షణికావేశంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలతో ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు.