Vishakha Love Story: విశాఖ లో సంచలనం సృష్టించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. ఇద్దరితో ప్రేమాయణం నడిపి మరొకరితో మ్యారేజ్ చేసుకున్న వీడియో బయటకు రావడంతో ఈ బేబీ కథ సంచలనంగా మారింది. అటు భర్త, మరోవైపు ప్రియుడికి రెడ్ హ్యాండెడ్ ఆ యువతి దొరికి పోవడంతో ఆ విషయం కాస్త ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ముందు సూసైడ్ గా కేసు నమోదు చేసుకున్న పోలీసులకు తరువాత లోతుగా విచారించగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆ యువతి ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్ భర్త సాయికి అనుకున్నా వారందరికి షాక్ ని కలిగించింది. ఆత్మహత్య చేసుకున్న యువతి రాసిన లెటర్ ప్రియుడు సూర్యకి రాసిందని గుర్తించారు. అయితే భర్త సాయికి తన భార్య ప్రేమాయణం తెలుపడంతో తనతోనే భార్య ఉండాలని చెప్పడంతోనే ఆ యువతి లెటర్ రాసి చనిపోయందని భావించిన పోలీసులు భర్త సాయిని అదుపులో తీసుకున్నారు. అయితే ప్రియురాలు చనిపోయిన విషయం తెలసిన సూర్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు మిగిలింది భర్త సాయిని పోలీసులు విచారిస్తున్నారు. దీంతో మూడు కుటుంబాల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదం నింపింది.
Read also: Meenakshi Chaudhary :కిల్లింగ్ లుక్స్ తో మతి పోగొడుతున్న హాట్ బ్యూటీ..
రెండు రోజుల క్రితం కొత్తపాలెం నాగేంద్ర కాలనీకి చెందిన ఇంటర్ చదువుతున్నా (18) యువతీ ఫ్యాన్ కు ఉరేసుకుని అనుమానస్పదా మృతి కేసు సంచలనంగా మారింది. లోతుగా విచారణ చేపట్టాగా వెలుగులోకి ఆసక్తి కరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఇందిరా నగర్ కు చెందిన లెంకా సాయితో ఏడాది క్రితం ఆ యువతికి పరిచయం ఏర్పడింది. సాయి అట్టికా గోల్డ్ లో పని చేస్తున్నాడు. ఇంట్లో వాళ్లకి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మూడు నెలల క్రితం హైదరాబాద్ నుండి విశాఖకు వచ్చిన సూర్య ప్రకాష్ తో కూడా ప్రేమాయణం నడిపిన యువతీ. ఇద్దరితో ఒకరికి తెలియకుండా మరొకరితో లవ్ ట్రాక్ నడిపింది. అయితే భార్యపై అనుమానం వచ్చిన భర్త సాయి గమనించాగా.. అసలు విషయం బయటకు వచ్చింది. తన భార్య.. సూర్య అనే అబ్బాయితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుందని ఒత్తిడికి గురిచేశాడు. నాతో అంటే నాతోనే ఉండాలని భర్త సాయి, ప్రియుడు సూర్య ప్రకాష్ పట్టుబట్టారు.
ఒత్తిడి తట్టుకోలేక చున్నీతో ఫ్యాన్ కు ఊరిసుకొని ఆత్మహత్యకు పాల్పడింది యువతి. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్య ప్రకాష్, సాయి లను విచారణ చేపట్టిన పోలీసులు. విషయం తెలిసి ఆందోళన చెందిన సూర్య ప్రకాష్, గోపాల్ పట్నం లో రైలు కింద పడి మృతి చెందాడు. అయితే ఆ యువతి ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ ఇప్పుడు కలకలం రేపుతుంది. భర్తకు సాయికి కాకుండా.. ప్రియుడు సూర్యకు రాసిన లెటర్ ఇప్పుడు సంచలంగా మారింది. నువ్వు నా ఫ్యావరెట్ పర్సన్.. నాకు ఏమైనా సరే నువ్వు జాగ్రత్త. నేను లేక పోయినా నా ఆత్మ నీకు తోడుగా ఉంటుంది. నువ్వు నా రక్తం.. నువ్వు నా ప్రాణం.. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మళ్లీ జన్మలో ఏ కుక్క గానో పిల్లి గానో పుడతాను. తల్లి దండ్రులు ఇద్దరు నాకు చాలా ఫ్రీడం ఇచ్చారు. మీ నలుగురు జాగ్రత్త అంటూ లెటర్ లో ప్రస్తావన చేసింది.
Rajanna Sircilla: వేకువ జామున మహిళపై దాడి.. సీసి కెమెరా లో చైన్ లాక్కెల్లే విజువల్స్..