Vizag MLC Election: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది.. ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో గండి బాజ్జీ.. పీలా గోవింద్, బైరా దిలీప్ ముందు వరుసలో ఉన్నారు.. అయితే, ఈ రోజు సాయంత్రం లోగా టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కూటమి అభ్యర్థిని ప్రకటించనున్నారని తెలుస్తోంది.. మరోవైపు.. ఈ ఎన్నికల్లో ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను రంగంలోకి దింపింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దీంతో.. ఈ రోజు వైసీపీ అభ్యర్థిగా బొత్స నామినేషన్ వేయనున్నారు.
Read Also: Neeraj Chopra-Manu Bhaker: నీరజ్ చోప్రాతో మను బాకర్ పెళ్లి.. ఒట్టు వేయించుకున్న వీడియో వైరల్!
ఇక, వైజాగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 838 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో వైసీపీకి 598.. కూటమికి 240 వరకు సంఖ్యాబలం ఉంది. అయితే, ప్రతిపక్ష పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే అధికార పార్టీకి టచ్‌లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.. మ్యాజిక్ ఫిగర్ 425 కాగా.. కనీసం 500 ఓట్ల మద్దతు లభిస్తేనే ఈ ఎన్నికల్లో సునాయసంగా గెలుపు సాధ్యం అవుతుంది. కానీ, టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావడంపై వైసీపీ మండిపడుతోంది.. సంఖ్యాబలం లేకపోయినా.. ఎన్నికల బరిలోకి దిగడం అంటే.. కచ్చితంగా ప్రలోభాలకు గురిచేయడం.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భయపెట్టడంలో భాగమేనని ఆరోపిస్తోంది వైసీపీ.. మరోవైపు రాజకీయంగా ఎదుర్కోవడానికి పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యింది.. మాజీ మంత్రులు, పార్టీ సీనియర్లు ఇప్పటికే తమ ఓటర్లను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు.
Read Also: Bigg Boss 8 Host: బిగ్‌బాస్ 8 హోస్ట్‌గా స్టార్ హీరోయిన్!
అయితే, విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి వైపే కూటమి మొగ్గుచూపుతుందన్న ప్రచారం సాగుతోంది.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ రోజు ప్రకటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ నెల 30న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.. వైసీపీ అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. అనుకున్నట్టుగా జరిగితే.. బొత్సను ఢీకొనబోతున్నారు బైరా దిలీప్ చక్రవర్తి.. దాదాపు బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారు అయినట్టు వినిపిస్తోంది.. 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించిన బైరా దిలీప్ చక్రవర్తిని.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దింపేందుకు సిద్ధం అవుతున్నారట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అయితే, హైకమాండ్ నుంచి పోటీపై.. అభ్యర్థిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.