విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది.. ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో గండి బాజ్జీ.. పీలా గోవింద్, బైరా దిలీప్ ముందు వరుసలో ఉన్నారు.. అయితే, ఈ రోజు సాయంత్రం లోగా టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కూటమి అభ్యర్థిని ప్రకటించనున్నారని తెలుస్తోంది..
MLC Elections 2024: ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి స్టార్ట్ అయింది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో పోటీకి బలమైన అభ్యర్థుల అన్వేషణలో వైసీపీ, టీడీపీ పార్టీలు ఉన్నాయి. ఇక, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.