సింహాచలం చందనోత్సవంలో భక్తుల అందోళనకు దిగారు. వీవీఐపీ టిక్కెట్లు కొనుగోలు చేసిన గంటల తరబడి క్యూ లైనల్లో ఉండిపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. EO డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు.
సింహాచల పుణ్యకేత్రంలో వరాహ నరసింహ స్వామి నిజరూప దర్శనం ప్రారంభమైంది. అప్పన్న స్వామిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పుణ్యక్షేత్రంలో భక్తులతో కిటకిటలాడుతోంది. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే స్వామి నిజరూపంలో దర్శనం ఇస్తారు. అందువల్ల భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.