Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Industries And Land Acquisition Tension For Joint Visakhapatnam District Mlas

Visakhapatnam: విశాఖ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్‌..!

Published Date :October 2, 2025 , 10:36 am
By Sudhakar Ravula
  • పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో కేరాఫ్ అడ్రస్‌గా విశాఖ..
  • ఉమ్మడి విశాఖ జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి..
Visakhapatnam: విశాఖ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్‌..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Visakhapatnam: పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఉమ్మడి విశాఖ జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. విస్తృతమైన కనెక్టివిటీ, భౌగోళిక సానుకూలత, మానవ వనరుల లభ్యత మేజర్ అడ్వాంటేజ్. ఇప్పటికే ఉన్న ఇండస్ట్రీస్ ఒక ఎత్తైతే.. ఫార్మా, గార్మెంట్, పెట్రోలియం అనుబంధ రంగాల పెట్టుబడులు విస్తృతమైన తర్వాత ఆసక్తి ఎక్కువైంది. అచ్యుతాపురం, పరవాడలో ఫార్మా పెట్టుబడులు రాగా వందల సంఖ్యలో కంపెనీలు వెలిశాయి. భవిష్యత్తులో పెట్టుబడులకు విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కీలకమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలోనే మిట్టల్ స్టీల్ వంటి పరిశ్రమలు ఏర్పాటును ప్రజలు స్వాగతిస్తున్నారు. పెట్టుబడులు వస్తే అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయం జనాల్లో ఉంది.

Read Also: America: తెల్లవారుజామున కారుకు ఎదురు వచ్చిన వింత జీవి.. ఉలిక్క పడ్డ డ్రైవర్

Also Read

  • Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
  • CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్‌ ఛేంజర్‌..
  • Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐ పట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
  • Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..

హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గమైన పాయకరావుపేట పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ కుంపటిని రాజేసింది. టీడీపీకి గట్టిపట్టున్న మత్స్యకార గ్రామం రాజయ్యపేటలో జనం ఎదురుతిరగడం, అనితను అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మత్స్యకారుల ఆందోళనలకు మద్దతుగా నిలిచాయి. బల్క్ డ్రగ్ పార్క్ పై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దిశగా ఐదేళ్ళ కార్మిక పోరాటం ఇంకా కొలిక్కి రాలేదు. విశాఖ ఉక్కుకు వచ్చిన ముప్పేమీ లేదని కూటమి స్పష్టం చేస్తోంది. అయినా, విశాఖ ఉక్కు- తెలుగోడి హక్కు నినాదం నిత్యం రగులుతూనే వుంది. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన చేయించాలనే డిమాండ్ ఎమ్మెల్యేలకు నిత్యం ఒత్తిడికి గురిచేస్తోంది. అలా ఎదుర్కొంటున్న వారిలో పల్లా శ్రీనివాస్‌ ముందు ఉన్నారు.

అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం పెదగంట్యాడలో తలపెట్టిన గంగవరం సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్‌ చుట్టూ వ్యతిరేకత ముసురుకుంటోంది. 20 ఎకరాల్లో సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేసింది. ఏడాదికి 40 లక్షల టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. దీనికి వేయి కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని పేర్కొంది. ఈ నెల 8న పబ్లిక్ హియరింగ్ జరగనుండగా జనావాసాల మధ్య సిమెంట్ పరిశ్రమ ఏర్పా టు ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ ఊపందుకుంది. పారిశ్రామిక అభివృద్ధి ఎవరు కాదనలేనిది. కానీ, రెడ్ జోన్ ఇండస్ట్రీస్ కారణంగా ఎదురయ్యే దుష్పరిణామాలు ప్రశ్నార్ధకంగా మారుతోంది. అందుకే జనంలో ఇంత వ్యతిరేకత వస్తుందంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • industries
  • Land acquisition
  • TDP MLAs
  • Visakhapatnam

తాజావార్తలు

  • RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు

  • Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions