Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాం బ్యూటీ తెలుగులో నటించిన రెండు సినిమాలు డిజాస్టర్లే! అయితేనేమి, కెరీర్ మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు తిరగకుండా సౌత్ లో ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉంది. ఫంకీ డిజాస్టర్ అయినా కయాదు లోహర్ కి వచ్చిన నష్టం ఏమీ లేదు, తమిళం, మలయాళంలో దూసుకుపోతుంది. ఒక్క సినిమా తలరాతను మార్చేస్తుంది అనడానికి కయాదు లోహర్ బెస్ట్ ఎగ్జాంపుల్. నాలుగేళ్ల పాటు నాలుగు సినిమాలు చేసినా రాని గుర్తింపును ‘డ్రాగన్’ తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత కయాదు మూడు భాషల్లో ఎనిమిది సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అస్సాం బ్యూటీ కయాదు లోహర్, ఐదేళ్ళు తిరగకుండానే సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తుంది. కయాదు తెలుగులో ‘అల్లూరి’ మూవీలో శ్రీవిష్ణుతో జతకట్టిన సినిమా ఫ్లాప్ కావడంతో మరో ఛాన్స్ దక్కలేదు. ‘డ్రాగన్’ హిట్ తర్వాత తెలుగులో బిజీ అయిపోయింది కయాదు. నాని పాన్ ఇండియా మూవీ ‘ది పారడైస్’ లో ఛాన్స్ కొట్టేసింది. ఇక తమిళంలో ‘ఇదయం మురళి’, ‘ఇమ్మోటల్’, ‘మంజనది’ వంటి మూడు సినిమాలతో పాటు లేటెస్ట్ గా సూర్యతో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది. ‘జై భీమ్’ తర్వాత సూర్య, దర్శకుడు టీజే జ్ఞానవేల్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా కయాదు సెలెక్ట్ అయింది.
కయాదు లోహర్ సౌత్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తమిళంలో నాలుగు, మలయాళంలో మూడు, తెలుగులో ఒకటి.. మొత్తం ఎనిమిది సినిమాలు చేస్తుంది. మలయాళంలో ‘ఐ యామ్ గేమ్’ మూవీలో దుల్కర్ తో నటిస్తుంది. ‘ఖరీఫా’, ‘ద ఇంట్రో’, ‘తారం’ వంటి మలయాళ చిత్రాలు చేస్తుంది. తెలుగు స్ట్రైట్ హిట్ పడితే గాని మన స్టార్స్ దృష్టి కయాదు పై పడదు. ‘డ్రాగన్’ హిట్ తర్వాత కయాదు జాతకం మారిపోయింది. అప్పటివరకు 30 లక్షలు తీసుకునే ఈ బ్యూటీ, ప్రస్తుతం రెండు కోట్లు డిమాండ్ చేసినా మూడు, నాలుగు కోట్లు తీసుకునే హీరోయిన్స్ కంటే తక్కువే. దీంతో కయాదు వరుస ఆఫర్స్ అందుకుంటుంది. సినిమాకి సంబంధించిన అన్ని ప్రమోషన్స్ కు రావడమే కాదు, స్టేజ్ మీద డాన్స్ చేసి హైప్ తీసుకొస్తుంది. కయాదు డాన్స్ లేకుండా ఈవెంట్ జరగదు. ఇలా “డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ హీరోయిన్” అన్న పేరు తెచ్చుకోవడంతో కయాదే కావాలంటున్నారు మేకర్స్. ఇలా ఎనిమిది సినిమాలతో బిజీ అయిపోయింది.
Also Read
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
తాజావార్తలు
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!